కుబేర సినిమా రిలీజ్ కావడానికి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సునీల్ నారంగ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సినిమాల రిలీజ్ తేదీని నిర్ణయిస్తున్నాయని ఆయన అన్నారు. ఒకటి రెండు వారాలు ఆలస్యమైతే వాళ్లు ఒప్పుకోవడం లేదని ఆయన కామెంట్లు చేశారు.
 
నేను జులై నెలలో కుబేర మూవీ రిలీజ్ కు ఓటీటీ సంస్థను అభ్యర్థించానని కానీ మొదట ప్రకటించిన జూన్ నెల 20వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని వాళ్లు నన్ను కోరారని ఆయన తెలిపారు. ఆ డేట్ లో రిలీజ్ చేయని పక్షంలో అంగీకరించిన మొత్తంలో 10 కోట్లు తగ్గిస్తామని చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ సునీల్ నారంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
కొన్ని సంఘటనల వల్ల పరిశ్రమ దెబ్బ తిందని మేము మూవీ సర్వీస్ ప్రొవైడర్ క్యూబ్ పై పూర్తిస్థాయిలో ఆధారపడ్డామని ఆయన చెప్పుకొచ్చారు. శాటిలైట్ లేకుండా సినిమాను రిలీజ్ చేయడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. బుక్ మై షో గంట పాటు ఇంటర్నెట్ ఆపేస్తే కలెక్షన్లు సున్నాకు పడిపోతాయని ఆయన తెలిపారు. అలా మేము వాటన్నిటిపై కాకుండా ఇప్పుడు ఓటీటీలో ఆధారపడాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు.
 
గతంలో శాటిలైట్, థియేటర్లను దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీసేవాళ్లమని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ను బట్టి సినిమాలు తీస్తున్నామని ఆయన తెలిపారు. కుబేర సినిమా ఓటీటీ రైట్స్ 47 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు ఇంకా రెండు సాంగ్స్ ఇవ్వాల్సి ఉందని సమాచారం అందుతోంది. కుబేర సినిమా ట్రైలర్, బుకింగ్స్ గురించి త్వరలో అప్ డేట్స్ అయితే రావాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: