టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి కెరియర్ ప్రారంభంలో ఎన్నో చిన్న చిన్న పాత్రలలో , విలన్ పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత హీరోగా అవకాశాలను తక్కించుకొని ఒక్కో విజయాన్ని అందుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. తెలుగులో స్టార్ హీరో స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే చిరు రాజకీయాలపై దృష్టి మళ్లించి కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

మళ్లీ ఖైదీ నెంబర్ 150 అనే సినిమాతో చిరు సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇకపోతే చిరంజీవి ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు కొన్ని మంచి విజయాలను అందుకున్న కూడా చిరంజీవి కేవలం ఒకే ఫార్మేట్ సినిమాలలో నటిస్తున్నాడు , హీరోయిన్ , డాన్సులు , పాటలు ఇలాంటి ఫార్మాట్ లోనే ఉన్నాడు. ఆయన తన రూట్ కాస్త మార్చి డిఫరెంట్ కథాంశాలతో తెరకెక్కే సినిమాల్లో నటిస్తే బాగుంటుంది అని కొంత మంది అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీనితో చిరు కూడా తన నెక్స్ట్ సినిమాల నుండి తన కథల ఎంపిక పూర్తిగా మార్చబోతున్నట్లు తెలుస్తోంది. చిరు మరి కొంత కాలంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో చిరంజీవి కి జోడిగా హీరోయిన్ ఉండదు అని తెలుస్తుంది. అలాగే ఈ మూవీ లో ఒక్క పాట కూడా ఉండదు అని తెలుస్తుంది. అలాగే చిరు , బాబి దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా కూడా కాస్త డిఫరెంట్ కథాంశంతో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా చిరంజీవి తన సినిమాల విషయంలో కాస్త డిసిషన్ను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: