కోలీవుడ్ స్టార్ హీరో ల లో ఒకరు అయినటు వంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం కూలీ అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునమూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టాలి అని ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మొదటగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయాలి అనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క మొదటి సాంగ్ ను వచ్చే వారంలో విడుదల చేయాలి అని మేకర్స్ ఆలోచనకు వచ్చినట్లు , అన్ని ఓకే అయితే మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇటు రజినీ కాంత్ హీరో గా రూపొందిన సినిమాలకు , అలాగే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమాలకు అనిరుద్ అద్భుతమైన సంగీతం అందించాడు. దానితో ఇప్పుడు రజిని , లోకేష్ కాంబోలో రూపొందిన సినిమాకు అనిరుద్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడో అని అనేక మంది ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: