
అయితే ఇప్పటికే చైతన్య శివ కాంభోలో గతంలో మజిలీ అనే సినిమా వచ్చింది .. అది సూపర్ హిట్ అయింది .. ఆ తర్వాత శివ నానితో టక్ జగదీష్ అనే సినిమా చేశాడు .. కానీ ఆ సినిమా అంతగా మెప్పించలేదు .. ఇక అప్పటి నుంచి శివ నిర్వాణ మరో అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు .. ఇప్పుడు కూడా మరోసారి ఫీల్ గుడ్ ఎమోషన్ కాస్త యాక్షన్ తో కూడిన స్టోరీని రాసుకున్నాడని తెలుస్తుంది .. అలాగే ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది .. అయితే ప్రస్తుతం చైతన్య కార్తీక్ దండూ తో సినిమా ఓ మైథలాజికల్ థ్రిల్లర్. . అలాగే ‘వృషకర్మ’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు .. ఈ మూవీ కోసం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ భారీ సెట్ కూడా వేశారు .. అక్కడ కొంతమేర షూటింగ్ జరిగింది .. అలాగే ఈ సినిమాలో చైతుకు జంటగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు