
సినీ ఇండస్ట్రీలో కొంతమంది సహాయం చేసిన విషయాన్ని గతంలో కూడా ఫిష్ వెంకట్ ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. అయితే ఇటీవలే కాలంలో పవన్ కళ్యాణ్ రెండు లక్షలు, నిర్మాత చదలవాడ కూడా లక్ష రూపాయలు మరొక హీరో విశ్వక్ సేన్ తో పాటు మరికొంతమంది ఆర్థికంగా సహాయాన్ని అందించారు. ఫిష్ వెంకట్ పలు చిత్రాలలో విలన్ గానే కాకుండా కమెడియన్ గా కూడా నటించి పేరు సంపాదించారు. కానీ సినిమాలలోకి ఫిష్ వెంకట్ ఎలా వచ్చారనే విషయం మాత్రం ఎవరికీ తెలియకపోవచ్చు.
ఫిష్ వెంకట్ కు తొలి సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్నారట. హైదరాబాదులో పుట్టి మంగలపల్లి లో పుట్టారు వెంకటేష్ .ఈయన మూడో తరగతి చదువుతున్న సమయంలో చదువు ఆపేసి మషీరాబాద్ లోని చేపల వ్యాపారం చేస్తూ ఉండేవారట. అక్కడ ఫిష్ వెంకట్ గా అందరికీ పరిచయమయ్యారు. తన స్నేహితుడు అయిన దివంగత నటుడు శ్రీహరి వల్లే వెండితెరకు పరిచయమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఆది సినిమాతో గుర్తింపు సంపాదించుకున్నారు ఫిష్ వెంకట్. ఈయనకు ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు ,ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే చివరి రోజుల్లో చాలా దీనమైన స్థితిలో మరణించారు ఫిష్ వెంకట్.