కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో కార్తీ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా తమిళ సినిమాలలో నటించి అందులో అనేక మూవీలతో మంచి విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కార్తీ కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాదు తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఈయన నాగార్జున హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఊపిరి అనే తెలుగు సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

తాజాగా కార్తీ ఓ తెలుగు దర్శకుడితో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం నాని హీరోగా మృనాల్ ఠాగూర్ హీరోయిన్గా హాయ్ నాన్న అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సౌర్యవ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతోనే ఈయన దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది.  

తాజాగా శౌర్యవ్ కార్తీ కి ఓ కథను వినిపించినట్లు , ఆ కథ బాగా నచ్చడంతో శౌర్యవ్ దర్శకత్వంలో మూవీ చేయడానికి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు  , మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి నిజం గానే కార్తీ , సౌర్యవ్ కాంబోలో సినిమా రూపొందుతుందా ..? లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: