టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ కొంత కాలం క్రితం కార్తికేయ 2 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2022 వ సంవత్సరం ఆగస్టు 13 వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమా ఆ సమయంలో ఎన్ని కోట్ల టార్గెట్తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఎన్ని కోట్ల కలక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 13.18 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 5.01 కోట్లు , ఉత్తరాంధ్రలో 4.51 కోట్లు ,  ఈస్ట్ లో 2.61 కోట్లు , వెస్ట్ లో 1.68 కోట్లు , గుంటూరు లో 2.78 కోట్లు , కృష్ణ లో 2.26 కోట్లు , నెల్లూరు లో 1.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 33.13 కోట్ల కలెక్షన్లు దక్కాయి. హిందీ లో ఈ సినిమాకు 15.50 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.92 కోట్లు , ఓవర్సీస్ లో 6.55 కోట్లు కలెక్షన్లు తగ్గాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 58.10 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 58.10 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ సినిమా 40.10 కోట్ల లాభాలను అందుకొని ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: