ఇప్పుడు తాజాగా వీరి రిలేషన్షిప్ కి మరింత బలం చేకూర్చేయేలా ఒక న్యూస్ వినిపిస్తోంది. సైమా అవార్డుల కోసం దుబాయ్ కి వెళ్లిన రష్మిక చేతికి ఒక ఉంగరం వంటిది కనిపించింది. దుబాయ్ కి రావడానికి ముందే రష్మిక ముంబైకి వచ్చినప్పుడు ఫ్యాన్స్ కు చేయి ఊపుతూ ఉండగా ఆమె మూడో వేలికి ఉంగరం కనిపించింది. ఈ రింగ్ గతంలో హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉండేది.. ఆ రింగ్ రష్మిక వేలికి ఉండడంతో ఎంగేజ్మెంట్అయిపోయిందా అనే విధంగా నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సైమా అవార్డు వేడుకలకు రష్మిక చీర కట్టులో రాగా.. ఆ ఉంగరాన్ని తన చిటికిన వేలికి మార్చుకుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీటిని చూసిన తర్వాత అభిమానులు, నేటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. మరి గుట్టు చప్పుడు కాకుండా రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ చేసుకున్నారా ?అనే అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చేలా చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన అటు రష్మిక కానీ, విజయ్ దేవరకొండ కానీ ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి