నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరో గా నటించిన అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికి తెలిసిందే. అఖండ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అఖండ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో అఖండ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇలా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించిన ఓ టీ టీ డీల్ కి సంబంధించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. కొంత కాలం క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఓ టీ టీ క్లోజ్ అయినట్లు , ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను ఓ ప్రముఖ ఓ టీ టీ సంస్థ ఏకంగా 80 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ఓ వార్త వైరల్ అయింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ ఓ టి టి హక్కులకు సంబంధించి మరో వార్త వైరల్ గా మారింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాకు సంబంధించిన ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు , ఈ మూవీ యొక్క ఓ టి టి హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 104 కోట్ల వరకు దక్కించుకున్నట్లు , అందులో భాగంగా ఈ సినిమా విడుదల అయ్యి కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: