ఎంతమంది మనల్ని ప్రశంసలతో ముంచెత్తినా, మనకి ఇష్టమైన వారు, మనకి దగ్గరైన వారు, మనకి కావాల్సిన వారు మనల్ని పొగిడితే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి లైఫ్‌లో కలిగే ఫీలింగ్. అందులో పెద్దగా తప్పుడు అర్థం లేదు, భూతద్దంలో పెట్టి చూడాల్సిన సీన్ కూడా కాదు. ఇదే విషయాన్ని ఓజీ  సినిమా విషయంలోనూ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇది జస్ట్ పేరు అనుకుంటే పొరపాటు. కోట్లాది మంది పవన్ కళ్యాణ్ అభిమానుల ఎమోషన్ ఇది. "ఓజీ అంటే చిన్నపేరే" అనుకునే వారు చాలామంది ఉన్నా, అది రాంగ్ అని తాజాగా సినిమా రిలీజ్‌ తర్వాత ప్రూవ్ అయింది.


టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ లేటెస్ట్ ప్రాజెక్ట్ ఓఘ్, భారీ అంచనాలతో, భారీ బడ్జెట్‌తో, భారీ తారగాణంతో విడుదలై, బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఒక్కమాటలో చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ "ముందు రోజు – తర్వాత "లా మారిపోయింది. హైలైట్ ఏంటంటే, గతంలో ట్రోల్ చేసిన బ్యాచ్ కూడా ఓజీ  విషయంలో గప్ చుప్ గా మారిపోయింది. దానికి ప్రధాన కారణం – ఈ సినిమాకోసం పవన్ కళ్యాణ్ పెట్టిన కష్టం కళ్లకు కట్టినట్లు కనబడటం. సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా చాలామంది స్టార్ సెలబ్రిటీలు ఆయన ఈజి సినిమాను ప్రశంసలతో ముంచేస్తున్నారు. చాలా రివ్యూలు వస్తున్నాయి – "థియేటర్‌కి వెళ్లి చూడండి", "తమన్ మ్యూజిక్ బాగుంది", "పవన్ యాక్షన్ బాగుంది" అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.



అయితే, అభిమానులు చెబుతున్న హైలైట్ పాయింట్ ఏమిటంటే – పవన్ కళ్యాణ్ కి దగ్గరైన, ఆయనకి ఇష్టమైన వ్యక్తి ఓజీ గురించి స్పందిస్తే, ఆ రివ్యూ మాత్రం స్పెషల్‌గా ఉంటుంది. ఆమె మరెవరో కాదు – పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజీనోవా. ప్రస్తుతం ఈ న్యూస్‌నే అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. "పవన్ కళ్యాణ్ సినిమాకి పెద్ద పెద్ద సెలబ్రిటీలు రివ్యూలు ఇవ్వడం కామన్, కానీ ఈజీ అంతకంటే స్పెషల్. పవన్ భార్య అన్నా లేజీనోవా గారు సినిమా చూసి రివ్యూ ఇస్తే, పవన్ పెదవులపై నిజమైన స్మైల్ కన్ఫామ్" అని అంటున్నారు.



ఎంతమంది రివ్యూలు ఇచ్చినా, మనసుకు ఇష్టమైన వాళ్ల రివ్యూ ఇస్తే వచ్చే ఆనందం వేరే అని ఎమోషనల్‌గా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. పవన్ భార్యసినిమా ఎప్పుడు చూస్తారు? చూసి రివ్యూ ఇస్తారా? ఇస్తే పవన్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అప్పుడు అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి...? కొంతమంది ఆమెకి తెలుగు రాదు అని..అందుకే సినిమాలు చూడరని కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: