తమిళ స్టార్ హీరో విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సీఎం అవ్వడమే లక్ష్యంగా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ప్రజల మనసు గెలుచుకునేందుకు ఇప్పటికే ప్రచారాలు స్టార్ట్ చేశాడు. ఆ మధ్యకాలంలో రెండు చోట్ల భారీ బహిరంగ సభలు పెట్టడంతో పాటు తన ఎన్నికలకు సంబంధించి ప్రచార యాత్ర కూడా మొదలు పెట్టాడు.ఈ నేపథ్యంలోనే విజయ్ మొదలుపెట్టిన ఈ ప్రచార యాత్రలో తొక్కిసలాట జరిగి దాదాపు 40 మంది మరణించారు.. అయితే ఇంత పెద్ద ఘోరం జరిగి 40 మంది ప్రాణాలు బలిగొనడానికి కారణం విజయ్ చేసిన ఒక్క తప్పు వల్లే విజయ్ ని చూడడానికి వచ్చిన 40 మంది ప్రాణాలు విడిచారట.50 కి పైగా మంది తీవ్ర గాయాలతో విలవిలలాడుతున్నారు. మరి ఇంతకీ విజయ్ చేసిన ఆ ఒక్క తప్పు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రచార ర్యాలీలో కేవలం 30 నిమిషాల్లోనే గందర గోళం అంతా జరిగిపోయింది.విజయ్ ప్రసంగం స్టార్ట్ చేసిన 15 నిమిషాలకే తొక్కిసలాట జరిగి పెను విషాదం జరిగింది. అయితే ఈ విషాదం జరగడానికి కారణం చిన్న స్థలంలో లక్షలాదిమంది గుమిగూడడం వల్లే ఇలా జరిగింది అని తమిళ మీడియాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా విజయ్ చేసిన మరొక తప్పు ఏంటంటే కరూర్ లో కార్నర్ మీటింగ్ నిర్వహించుకునేందుకు టీవీకే పార్టీ అధినేత విజయ్ పోలీసుల వద్ద అనుమతి తీసుకున్నారు.కానీ ఆ అనుమతి కేవలం 10 వేల మందికి మాత్రమే తీసుకున్నారు.

కానీ ఈ మీటింగ్ నిర్వహించే సమయంలో విజయ్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనూహ్యంగా ఒకరిని చూసి ఒకరు దాదాపు రెండు లక్షల మంది వరకు ఆ ప్లేస్ కి చేరుకున్నారట. అయితే పోలీసుల నుండి పదివేల మందికి మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు.అలాగే ఆ మీటింగ్ జరిగే స్థలం కూడా చిన్నది కావడంతో రెండు లక్షల మంది ఉండడానికి సరిపడా స్థలం లేక తొక్కిసలాట జరిగినట్లు తమిళ మీడియా చానల్స్ చెబుతున్నాయి. అలా తనకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలాంటిదో తెలిసి కూడా విజయ్ ఇలాంటి పనులు చేసి 40 మంది ప్రాణాలు బలిగొన్నాడు అంటూ తమిళనాడు ప్రజలతో పాటు రాజకీయ నాయకులు ఆయన్ని విమర్శిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 40 మంది చనిపోగా 50 మందికి పైగా తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: