మెగాస్టార్ చిరు హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతున్న తాజా చిత్రం మన శంకర్ ప్రసాద్ గారు . ఈ మూవీ పై భార్య అంచనాలు ఉన్నాయి . ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించని పోతున్నట్లు సమాచారం . ఇక హీరోయిన్గా నయనతార ఈ మూవీలో నటిస్తుంది . ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన మీసాల పిల్ల సాంగ్ ప్రోమో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు .


దీంతో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చే ప్రతి కంటెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకుంటున్నారు . ఇక మీసాల పిల్ల ఫుల్ సాంగ్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి తన ప్రత్యేక గ్రేస్తో స్క్రీన్ ను డామినేట్ చేయనున్నారని.. బీన్స్ అందించిన మ్యూజిక్ సీనియర్ సింగర్ ఉదిత్ నారాయణ వోకల్స్  ఈ పాటను మరింత బలంగా నిలబెట్టనున్నాయని తెలుస్తుంది . ఇక మరోవైపు ఈ చిత్రంలో నయనతార శశిరేఖ పాత్రలో కనిపించనుంది అని అనిల్ రావిపూడి ఇప్పటికే వెల్లడించాడు . ప్రస్తుతం ప్రత్యేకంగా వేసిన సెట్లో పాటల చిత్రీకరణ వేగంగా నడుస్తుంది .


ఈ భారీ ప్రాజెక్టును సాహో గారపాటి మరియు సుష్మిత కొన్ని డేల సంయుక్తంగా నిర్వహిస్తున్నారు . 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు ఈ మూవీని తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు . ఇక అక్టోబర్ 5 నుంచి వెంకటేష్ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు సమాచారం . ఇక ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ని కూడా ప్రేక్షకులు చాలా సీరియస్ గా తీసుకోవడంతో .. ఈ మూవీ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మూవీ టీం . ఈ మూవీ పై ఉన్న కేర్ను మరింత పెంచినట్లు తెలుస్తుంది . మరి ఈ సినిమా మెగా ఫాన్స్ ని ఎంతవరకు ఫుల్ ఫిల్ చేయనుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: