
రుక్మిణి తెరపై కనిపించిన ప్రతి సీన్‌లోనూ నటన పీక్స్‌లో ఉందని సినీ విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె నటన చూసిన తర్వాత చాలా మంది దర్శకులు, నిర్మాతలు పెద్ద ప్రాజెక్టుల కోసం ఆమెను సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.ఇక బిగ్ స్క్రీన్‌పై రుక్మిణి వసంత్ మ్యాజిక్‌కి బాలీవుడ్ కూడా ఆకర్షితమవుతోంది. ‘కల్కి 2’ మూవీలో దీపికా పదుకొనేకి ఆఫర్ చేసిన రోల్‌ను రిజెక్ట్ చేసి, అదే రోల్‌లో ఇప్పుడు రుక్మిణి వసంత్ ఎంపికైనట్లు సమాచారం. ఈ న్యూస్ ప్రస్తుతం తెలుగు మరియు కన్నడ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదంతా దేవుడు ఇచ్చిన టైమింగ్ అని చెప్పొచ్చు. కాంతారా చాప్టర్ 1 విజయం తర్వాత రుక్మిణి కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. రిషబ్ శెట్టి లాంటి పర్ఫెక్షనిస్ట్ హీరోలతో స్క్రీన్‌షేర్ చేయడం రుక్మిణి వసంత్‌కి మరింత గౌరవం తెచ్చిపెట్టింది.
సోషల్ మీడియాలో ఆమెపై పోస్టులు, రీల్స్, వీడియోలు వర్షంలా పడుతున్నాయి. అభిమానులు ఆమెను “నెక్స్ట్ నేషనల్ క్రష్” అని పిలుస్తున్నారు. సినీ సర్కిల్స్‌లో ఇప్పుడు ఒక్క మాటే వినిపిస్తోంది —“అందరూ అనుకున్నట్లే జరిగింది… రుక్మిణి వసంత్ ఒక్క సినిమాతోనే టాప్ రేంజ్ హీరోయిన్ అయిపోయింది!” ఇలా రుక్మిణి వసంత్ కేవలం సౌందర్యంతో కాకుండా తన ప్రతిభతో, కష్టపాటుతో, మరియు తెరపై చూపించిన ఎమోషనల్ కనెక్ట్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది" అంటూ పొగిడేస్తున్నారు. ఇక తారక్ తో నటించే డ్రాగన్ సినిమా విడుదలైతే మాత్రం ఆమె కెరీర్ పీక్స్ కి వెళ్లిన్నట్లే అని చెప్పుకోవడంలో సందేహమే లేదు..!