ఇప్పటివరకు “నేషనల్ క్రష్” అనే పదం వినగానే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి మనసులో మెదిలే పేరు — రష్మిక మందన్న. ఆమె నటన, ఆమె అందం, ఆమె ఫ్యాషన్ సెన్స్, మాట్లాడే తీరు — ప్రతి ఒక్కటిలోనూ ప్రత్యేకత ఉంటుంది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో, చిలిపి నవ్వుతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న రష్మిక, చాలా తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. రష్మికను అభిమానించే ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆమెను ట్రోల్ చేసే వారిని కూడా స్మార్ట్‌గా, ఎప్పుడూ స్మైల్‌తో ఎదుర్కొనే రష్మిక ఆ వ్యక్తిత్వం కూడా ఆమెను మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆమె సింప్లిసిటీతో పాటు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఆమె ఇమేజ్‌కి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.


అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది — “రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ నిశ్చితార్థం పూర్తి అయింది” అనే వార్త. ఈ వార్త బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ట్రెండింగ్ లిస్టులోకి ఎగబాకింది. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు రష్మిక కానీ విజయ్ దేవరకొండ కానీ, లేదా వారి కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అందుకే మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనని అభిమానులు నమ్మకంగా చర్చించుకుంటున్నారు. ఇక మరో వైపు, రష్మిక పెళ్లి చేసుకుంటే ఆమె “నేషనల్ క్రష్” ఇమేజ్ కొనసాగుతుందా అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో ఊపందుకుంది. చాలామంది అభిప్రాయం ప్రకారం, పెళ్లి తర్వాత రష్మికకు కొన్ని రకాల పాత్రల్లో నటించడంలో పరిమితులు రావచ్చు. ఆ కారణంగా ఆమెకున్న క్రేజ్ కొంత తగ్గవచ్చని అంటున్నారు.ఇదే సమయంలో, “రష్మిక తర్వాత ఆ నేషనల్ క్రష్ స్థానం ఎవరికి దక్కుతుంది?” అనే ప్రశ్న సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌గా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే — అందరూ ఒకే పేరు చెబుతున్నారు.


అదే పేరు — రుక్మిణి వసంత్!. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అద్భుతమైన నటనతో, సొగసైన లుక్స్‌తో తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిపోయిన రుక్మిణి, తాజాగా విడుదలైన “కాంతారా చాప్టర్ 1” సినిమాతో బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసింది. రిషబ్ శెట్టి పక్కన ఆమె నటన చూసి ప్రేక్షకులు మైమరచిపోయారు. డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ — అన్నీ టాప్ క్లాస్ అనిపించుకున్నాయి.అంతేకాదు, ప్రస్తుతం రుక్మిణి వసంత్ ఎన్‌టీఆర్ సరసన నటిస్తున్న పాన్-ఇండియా భారీ ప్రాజెక్ట్ “డ్రాగన్” సినిమాలో స్క్రీన్ షేర్ చేస్తోంది. ఆ ఒక్క వార్తే సోషల్ మీడియాలో ఊచకోత కోస్తోంది. రుక్మిణి పేరు ఇప్పుడు దక్షిణాదినే కాదు, ఉత్తర ఇండియా సినీ సర్కిల్స్‌లో కూడా మారు మ్రోగుతోంది.ఫ్యాన్స్ కామెంట్స్ చూస్తే ఒకే మాట వినిపిస్తోంది — “రష్మిక తర్వాత నేషనల్ క్రష్ ట్యాగ్ దక్కించుకునే బ్యూటీ రుక్మిణి వసంత్ తప్ప మరెవ్వరూ కాదు!”. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ, స్మార్ట్ చాయిస్‌లు తీసుకుంటూ రుక్మిణి వసంత్ ఇప్పుడు “నెక్ట్స్ బిగ్ థింగ్” గా ఎస్టాబ్లిష్ అవుతోంది. ఆమె నటనలోని క్లాస్, వ్యక్తిత్వంలో ఉన్న గ్రేస్, మరియు ప్రేక్షకుల హార్ట్‌లను టచ్ చేసే పర్ఫార్మెన్స్ — ఇవన్నీ కలిపి రుక్మిణిని “నెక్స్ట్ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా”గా తయారు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: