మాస్ మహారాజా రవితేజ తాజాగా మాస్ జాతర అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఒక సినిమాను ఎంత గొప్పగా తీసామో అనే దాని కంటే ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఎంత సూపర్ గా చేశాము అనేదే ప్రస్తుతం చాలా ముఖ్యంగా మారింది. సినిమాను అద్భుతంగా తీసిన కూడా ప్రమోషన్లను ఆ స్థాయిలో చేయనట్లయితే ఆ మూవీ ప్రేక్షకుల్లోకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మాస్ జాతర మూవీ యూనిట్ మాత్రం ప్రమోషన్ల విషయంలో అస్సలు తగ్గడం లేదు. ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసిన తర్వాత నుండే ఈ మూవీ బృందం వారు పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన చేస్తూ వస్తున్నారు. ఇకపోతే సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను పెద్ద స్థాయిలో చేసిన ఆ మూవీ పై అంచనాలను భారీగా పెంచాలి అంటే ఆ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండాల్సిందే. మరి ముఖ్యంగా ఏదైనా సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యాక ఆ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉన్నట్లయితే అంచనాలు తారా స్థాయికి చేరిపోతూ ఉంటాయి.

దానితో చాలా మంది సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందో ఆ ట్రైలర్ను చూశాక సినిమా చూడాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే తాజాగా మాస్ జాతర మూవీ యూనిట్ వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను అక్టోబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ వారు అధికారికంగా ప్రకటించారు. దానితో చాలా మంది ఈ మూవీ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ గనుక అద్భుతంగా ఉన్నట్లయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt