సాధారణంగా ఇండియాలో గంజాయి వాడకం నిషేధం అన్న విషయం తెలిసిందే. గంజాయి వాడే వారిని కఠినంగా శిక్షిస్తే ఉంటారు పోలీసు అధికారులు. అంతేకాదు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారి ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. గంజాయి కారణంగా యువత పెడదారి పట్టే అవకాశముందని అంతే కాదు దేశం మొత్తం గంజాయి మత్తులో తూగే చాన్స్ ఉంది అనే కారణంతో గంజాయి పట్ల కఠినమైన ఆంక్షలు కొనసాగిస్తూన్నారు. కేవలం భారత్లో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలు కూడా గంజాయి పై నిషేధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.


 మొన్నటివరకు థాయిలాండ్ లో కూడా గంజాయి పై ఇలాంటి నిషేధాజ్ఞలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల ఏకంగా గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేస్తూ థాయిలాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయింది. అయితే ప్రభుత్వం నిషేధం విధిస్తేనే  దొంగచాటుగా వాడే వారు ఎక్కువగా ఉంటారు. ఇక గంజాయి చట్టబద్ధం చేయడంతో థాయిలాండ్ లో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా గంజాయి వినియోగం పెరిగిపోయింది.  రైతులు కూడా గంజాయి పంట వేస్తూ ఉండటం గమనార్హం.


 ఈ క్రమం లోనే కెఫేలు, దుకాణాల్లో రకరకాల గంజాయి ఉత్పత్తులు విక్రయించడం కూడా మొదలుపెట్టారు. ఐస్ క్రీమ్స్ తో పాటు ఇతర కూల్డ్రింక్స్ పైన కూడా గంజాయి చళ్ళుతు అమ్మకాలు పెంచుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే  ఏకంగా గంజాయి తో కూరలు కూడా వండుతున్నారట. మనదేశంలో ఇంటికో మొక్క అన్న విధంగా అక్కడ థాయ్ ల్యాండ్ లో  ఇంటికో గంజాయి మొక్క పంచుతుంది  ప్రభుత్వం.. దీంతోహాయిగా గంజాయి పండిస్తూ ఇక కూరలు కూడా వండు కుంటున్నారట. ఇక రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఎక్కడ వరకు తీసుకెళ్తుందో అని ఎంతో మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: