ఇటీవల థాయిలాండ్ లో జరిగిన దారుణమైన కాల్పులకు సంబంధించిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక ఉన్మాది జరిపిన కాల్పులకు ఏకంగా 24 మంది చిన్నారులతో పాటు 30 మందికి పైగా మృతి చెందిన ఘటన అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. థాయిలాండ్ లోని ఓ డే కేర్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ మారణకాండలో అందరూ చనిపోగా అక్కడే ఉన్న ఒక చిన్నారి మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడింది.


 ఇలా చిన్నారి ప్రాణాలతో బయటపడటానికి కారణం ఆ సమయంలో ఆమె తరగతి గదిలో ఒక మూలన దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉండడమే. మూడేళ్ల పవినెట్ సుపోల్ వాంగ్ అనే చిన్నారి గాఢ నిద్రలో ఉన్న సమయంలో తల్లిదండ్రులు ఆమెపై దుప్పటి కప్పారు. ఇక గాఢనిద్ర ఆ చిన్నారి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటనలో క్షేమంగా భయపెట్టబడిన ఏకైక చిన్నారి ఈమె కావడం గమనార్హం. ఇక తన బిడ్డ బ్రతికి ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నామంటూ తల్లిదండ్రులు చెబుతున్నారు. అదే సమయంలో తమ పిల్లలను కోల్పోయిన ఇతర కుటుంబ సభ్యులను చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుంది అంటూ తెలిపారు.


 అయితే సంఘటన స్థలంలో విచక్షణ రహితంగా నిందితుడు కాల్పులు జరిపి వెళ్లిపోయిన తర్వాత గదిలోని ఒక మూలన కదలికలు కనిపించడంతో ఈ కదలికల ఆధారంగా పాప బతికి ఉన్నట్లు గుర్తించాము అంటూ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే తోటి పిల్లల మృతదేహాలు కనిపించనీయకుండా తీసుకొచ్చినట్లుగానే  దుప్పటితో ఆమె ముఖాన్ని కప్పి బయటకు తీసుకువచ్చారు అని చెప్పాలి. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో చనిపోయిన 11 మంది చిన్నారులు కూడా ఇక ఈ చిన్నారిని నిద్రిస్తున్న గదిలోనే ఉన్నారట. ఇక ఇలా థాయిలాండ్ లో జరిగిన మారణ హోమంలో చిన్నారి గాఢ నిద్ర కారణంగా ప్రాణాలతో బయటపడడంతో ఆమె మృత్యుంజయురాలు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri