సాధారణంగా చాలామంది నేరస్తులు ఏదైనా నేరాలకు పాల్పడ్డారు అంటే చాలు పోలీసులకు దొరక్కుండా ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్ని నేరాలు చేసిన ఇక పోలీసులకు దొరక్కుండా సరికొత్త సవాళ్లను విసరడం లాంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పోలీసుల లిస్టులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా తన పేరు లేకపోతే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక నేరస్తుడు మాత్రం అలా చేయలేదు. ఏకంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్టును పోలీసులు విడుదల చేయగా అందులో తన పేరు లేకపోవడంతో బాగా హర్ట్ అయ్యాడు.


 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్టులో తన పేరు లేదేంటి అని ఏకంగా పోలీసులనే ప్రశ్నించాడు.. ఇక ఇలాంటి ఒక పోస్ట్ పెట్టి చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు ఈ క్రిమినల్. ఈ విచిత్రమైన ఘటన అమెరికాలోని జార్జియాలో వెలుగు చూసింది. ఇటీవలే జార్జియా పోలీసులు టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాను విడుదల చేశారు. హత్యలు, ఆయుధాలతో బెదిరించి దోపిడీ చేయడం, కిడ్నాప్ సహ మరిన్ని నేరాలకు సంబంధించిన నేరస్తుల జాబితాను విడుదల చేశారు. కాగా పోలీసులకు ఒక విచిత్రమైన రిప్లై వచ్చింది.. అప్పటికి కొన్ని నేరాలు చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న తన పేరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్టులో ఎందుకు లేదు అంటూ క్రిష్టఫర్ స్పాండింగ్ అనే నేరస్తుడు కామెంట్ చేశాడు.. దీంతో స్పందించిన పోలీసులు నువ్వు చెప్పింది నిజమే నీ మీద రెండు వారెంట్ లు ఉన్నాయి. నీకోసం వస్తున్నాం అంటూ రిప్లై ఇచ్చారు. నిన్ను పట్టుకోడానికి నువ్వే సహాయం చేశావు అభినందనలు అంటూ పోలీసులు సెటైరరికల్ గా పోస్ట్ పెట్టారు. ఇక తర్వాత రోజే అతని అరెస్టు చేశారు పోలీసులు.  ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri