సినిమా పరిశ్రమ అంటేనే వివిధ ఆలోచనల, అలవాట్ల, ప్రవర్తనల మనుషుల కోలాహలం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియదు. కానీ సినిమాల్లో రాణించాలని తమ స్థాయిని పెంచుకోవాలని ప్రతి ఆర్టిస్ట్ తహతాహలాడుతాడు. కానీ అదృష్టం మాత్రం కొందరినే వరిస్తుంది. వీరు మాత్రమే సినిమా పరిశ్రనలో ఉన్నత స్థానంలో ఉంటారు. ఇక మిగతా వారంతా చాలీ చాలని జీతంతో అనేక సమస్యలను ఎదుర్కొంటూ.. అనేక వేధింపులకు గురౌతూ నానా తంటాలు పడుతూ ఉంటారు.


Image result for marraige

అయితే సినీ పరిశ్రమకు చెందిన మహిళా ఆర్టిస్టులకు వేధింపులు గానీ, మోసాలు, గానీ, అన్యాయాలు గానీ ఏ రేంజిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. ప్రేమ పేరుతో వివాహం చేసుకుని ముఖం చాటేశాడని ఆరోపిస్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న సుజాత అనే యువతి భర్త యశ్వంత్ ఇంటి ముందు మౌన దీక్షకు దిగిన ఘటన చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...  గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరుకు చెందిన యశ్వంత్‌ హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో  పనిచేస్తున్నాడు.


Image result for marraige

తనకు ఫేస్ బుక్ ద్వారా అతను పరిచయమయ్యాడని సుజాత చెప్పింది. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారిందిని సుజాత చెప్పింది. యశ్వంత్ పెళ్ళి ప్రతిపాదన తీసుకురాగా తాను అంగీకరించానని చెప్పారు. అయితే పెళ్ళి చేసుకొన్న తర్వాత అతను తనను మోసం చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: