కరోనా ఈ పేరు వింటే చిన్నా పెద్ద ఎవ్వరైనా ఒక్కసారే ఉలిక్కి పడుతున్నారు.  ప్రజలు ఇప్పటి వరకు ఎన్నో రకాల వైరస్ లు ఎదుర్కొన్నారు.. క్యాన్సర్ తో పోరాడి ఎదిరించింది బతికిపోయారు. ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధిని రూపుమాపే దిశగా అడుగులు వేస్తున్నారు.  కానీ కనీ వినీ ఎరుగని రీతిలో కరోనా మహమ్మారిని తట్టుకోలేక పోతున్నారు.  చిన్న దేశాలే కాదు ఇప్పుడు ఈ కరోనా భారిన పడి పెద్ద పెద్ద దేశాలు భయంతో వణికి పోతున్నాయి. ఒక్క అమెరికాలోనే 80 వేల మంది చనిపోయాయంటే.. కరోనా ఎలాంటి భయంకర రూపం దాల్చుతుందో అందరికీ అర్థం అవుతుంది.  ఇక కరోనా వల్ల సామాన్యులు.. సెలబ్రెటీలు ఇంటిపట్టున ఉండే పరిస్థితి ఏర్పడింది.  బ్యాడ్ లక్ ఏంటంటే కరోనా ఉన్న వ్యక్తులను తాకినా వారి సమీపంలో ఉన్నా వైరస్ అంటుకుంటుంది.  

 

ఇలా కొంత మంది దొంగల వల్ల అన్యాయంగా పోలీసులు చిక్కుల్లో పడుతున్నారు. అరెస్టయిన ఓ దొంగకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో అతన్ని పట్టుకున్న పోలీసులందరినీ అధికారులు క్వారంటైన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రంలోని పూరీ సిటీలో దొంగతనం చేసిన వ్యక్తిని కుంభర్‌పారా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ లో ఉంచారు. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు, కాంటాక్టు అయిన సిబ్బందిని క్వారంటైన్ కు తరలించినట్లు పూరి జిల్లా ఎస్పీ ఉమాశంకర్ దాస్ మీడియాకు వెల్లడించారు.

 

 అతన్ని శనివారం ఎస్డీజేఎం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించేముందు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. నిందితుడితో ఆరుగురు సిబ్బంది కాంటాక్ట్ అయ్యారని, మొత్తం 30 మంది పోలీసు సిబ్బందిని క్వారంటైన్ లో ఉంచామని చెప్పారు. వారందరికీ టెస్టులు చేయిస్తామన్నారు. నిందితుడిపై నాలుగు దొంగతనం కేసులున్నాయని, అతడికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని తెలిపారు.  ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వచ్చిన మొదటి ఖైదీ ఇతడేనని ఎస్పీ వెల్లడించారు. ఒడిశాలో ఇప్పటివరకు 828 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్ బారిన పడి నలుగురు చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: