ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనపై సామాజిక వర్గాల పరంగా ఆరోపణలు గట్టిగానే వచ్చాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు బీసీ వర్గాల నాయకులను జగన్ అరెస్ట్ చేయించాడని, బీసీలకు వైయస్ జగన్ మొండిచేయి చూపిస్తున్నారు అంటూ టీడీపీ నేతలు ఇటీవల భారీ స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం అందరికీ తెలిసిందే. ఏకంగా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా వైయస్ జగన్ బీసీలను టార్గెట్ చేశాడని...ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులను రాజకీయంగా అణగదొక్కడానికి తప్పుడు కేసుల్లో ఇరికించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే.

IHG

ఈ పరిణామంతో వైయస్ జగన్ తన భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా... పార్టీ పరంగా ఇచ్చే పదవుల్లో బీసీలకు చెందిన నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడతారని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ వైఎస్ జగన్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలో  నిమ్నవర్గాల గా చెప్పబడే వారికి పెద్ద పీట వేస్తూ మరో రెండు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టటం జరిగింది.

IHG

ఒకటి ఎస్సీ వర్గానికి నల్లజర్ల ప్రాంతానికి చెందిన మోషన్ రాజుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వగా, మరొకటి కడప ప్రాంతానికి చెందిన మైనారిటీ నాయకుడు అఫ్జల్ ఖాన్ కి ఇచ్చినట్లు వైసీపీ పార్టీలో టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ రెండు పేర్లు వైసీపీ పార్టీ పెద్దలు ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ దెబ్బతో పార్టీలో ఏయే వర్గాల్లో అసంతృప్తి నెలకొని ఉందో బయటపడే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: