తెలంగాణాతో పాటుగా ఏపీని కూడా ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఇబ్బంది పెడుతుంది. దాదాపు 10 రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు బయటపడ్డాయి. దీని కారణంగా ప్రభుత్వాలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా చికెన్ ఉత్పత్తులపై ఆందోళన ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని చర్యలను రాష్ట్ర పశు సంవర్ధక శాఖ తీసుకుంది. అయినా సరే రైతుల్లో ఆందోళన ఉంది. తాజాగా బూరుగుల రామకృష్ణ భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు.

బర్డ్ ఫ్లూ మీద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బర్డ్ ఫ్లూ మీద మేము అలెర్ట్ గా ఉన్నాము అని అన్నారు. సంగారెడ్డి తో పాటు  కొన్ని జిల్లాల్లో కోళ్లు చనిపోయాయి అని ఆయన అన్నారు. వాటికి టెస్ట్ లు చేసాము బర్డ్ ఫ్లూ తో చనిపోలేదు అని ఆయన ప్రకటించారు. రాష్ట్ర సరిహద్దుల్లో జాగ్రత్తగా ఉండాలి అని ఆయన కోరారు. మన రాష్ట్రానికి బర్డ్ ఫ్లూ రాదు అని ఆయన స్పష్టం చేసారు.  ఫౌల్ట్రీ ఇండస్ట్రీ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది అని ఆయన అన్నారు. కోడి గుడ్డు, కోడి కూర వేడిగా వండుకుని తింటాము అని... కాబట్టి కోడి కూర, కోడి గుడ్డు తినడం వలన బర్డ్ ఫ్లూ రాదు అని ఆయన అన్నారు.

పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రన్ మాట్లాడతూ... బర్డ్ ఫ్లూ మనుషులకు రాదని శాస్త్ర వేత్తలు నిర్దారించారు అని అన్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలో కోళ్లు చనిపోయాయని అన్నారో అక్కడ అన్ని రకాల టెస్ట్ లు చేశాము అని ఆమె పేర్కొన్నారు. అక్కడ బర్డ్ ఫ్లూ లక్షణాల తో కోళ్లు చనిపోలేదు అని... 276 ప్రాంతాలల్లో కోళ్లకు  టెస్ట్ లు  చేసాము ఎక్కడ బర్డ్ ఫ్లూ లక్షణాలు కనపడలేదు అని ఆమె వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: