ప్రేమ మదురమైనదని అంటారు. అంతే కాదు ప్రేమ గుడ్డిదని కూడా చెబుతారు. ప్రేమ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తారు.. ఎలాంటి సాహసాలకైనా సిద్ధమవుతారు. ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు. ప్రేమ అంత పవర్ ఉంటుంది మరీ. తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. ఎయిడ్స్ చాలా ప్రమాదకరమైన అంటు వ్యాధి. అయినా తన లవర్ కు ఎయిడ్స్ ఉందని తెలిసినా.. అతన్ని పెళ్లాడింది ఓ ప్రేమికురాలు.
 
      తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
నాగర్ కోయిల్ లో ప్రైవేటు కాలేజీలో డిగ్రీ తొలి సంవత్సరం చదువుతున్న ఓ 17 ఏండ్ల  బాలిక ..  రెండు రోజులుగా కనిపించడం లేదు. దీంతో ఆమె తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మిస్సైన బాలిక ఆచూకి కోసం గాలించారు. చివరకు ఆమె 22 ఏళ్ల ఆటో డ్రైవర్ తో ప్రేమలో ఉన్నట్టు తమ విచారణలో గుర్తించారు. ఇద్దరూ కలిసి కోవైలోని స్నేహితుల వద్దకు వెళ్లారని, అక్కడే వివాహం చేసుకున్నారని పోలీసులు తేల్చారు. సదరు ఆటో డ్రైవర్ కు హెచ్ఐవీ ఉందని తెలిసి కూడా ఆమె వివాహానికి అంగీకరించిందని పోలీసు అధికారి  తెలిపారు.

       బాలికకు మైనార్టీ తీరకపోవడంతో .. ఆమెను పెండ్లి చేసుకున్న డ్రైవర్ పై పోక్సో చట్టం కింద
 కేసు పెట్టారు. అతన్ని అరెస్ట్ చేసు జైలుకు పంపించారు. తాము వారి వద్దకు వెళ్లిన సమయంలో భర్త అరెస్ట్ ను అడ్డుకున్న బాలిక, రోడ్డుపై బైఠాయించి, తనను కూడా తీసుకెళ్లాలని గొడవ చేసిందని పోలీసులు తెలిపారు. బాలికకు కూడా హెచ్ఐవీ సోకిందేమోనన్న అనుమానంతో..  ఆమెను ప్రభుత్వాసుపత్రిలో మరిన్ని పరీక్షల నిమిత్తం చేర్చామని, కేసును విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.  ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: