ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో  తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం సరిహద్దుల్లో ఈ క్షణంలో యుద్ధం తలెత్తుతుందో  అనే విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే..  ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో అటు ఇరు దేశాలు కూడా భారీగా సైనికులను మోహరించడం తో పాటు  ఆయుధాలను కూడా మొహరిస్తూ   ఉండడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసింది. ప్రస్తుతం చైనాతో  ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణంలో అయినా చైనా యుద్ధానికి దిగే అవకాశం ఉంది అని భావించిన భారత్ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇక భారత ఆర్మీ ని మరింత పటిష్టవంతం చేసే నిర్ణయాలను తీసుకుంటుంది అన్న విషయం తెలిసిందే.



 ఇప్పటివరకు ఫ్రాన్స్ నుంచి ఏకంగా పదకొండు రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది భారత్ ఇక 11 రాఫెల్ యుద్ధ విమానాలతో భారత వాయుసేన మరింత పటిష్టంగా మారిపోయింది అనే విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో ప్రస్తుతం తేజస్ యుద్ధ విమానాలు కూడా భారత్ లో కొనసాగుతున్నాయి.  మరోవైపు అధునాతన టెక్నాలజీతో కూడిన క్షిపనులను అభివృద్ధిచేసి ప్రయోగాలు నిర్వహించి భారత అమ్ములపొదిలో చేరుస్తూ భారత్ మరింత పటిష్టంగా మారుతుంది. అదే సమయంలో అగ్రరాజ్యాలతో దౌత్య పరంగా కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అని తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇటీవల భారత్ మరో ముందడుగు వేసింది. ఏకంగా అత్యవసర వినియోగం కోసం అమెరికా నుంచి ఎంతో అధునాతన టెక్నాలజీతో కూడిన  యుద్ధ విమానాలను కోసం ఆర్డర్  ఇవ్వగా ఇక అత్యవసర వినియోగం కోసం యుద్ధవిమానాల ఇచ్చేందుకు జో బైడెన్  ప్రభుత్వం అంగీకారం తెలిపింది .  అయితే ఇప్పటికే తమ దగ్గర ఉన్న  జే17యుద్ధ విమానాలు రాఫెల్  యుద్ధ విమానాల కంటే శక్తివంతమైనవి అని చైనా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు అమెరికా నుంచి యుద్ధ విమానాలు భారత్లోకి అత్యవసర వినియోగం కోసం వస్తుండడంతో భారత వాయుసేన మరింత పటిష్టవంతంగా మారింది అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: