
జబల్‌పూర్ వీహెచ్‌పీ నేత అయిన సరబ్‌జీత్ సింగ్ మోఖాకు ఇదే నగరంలో ఓ ఆసుపత్రి కూడా ఉండటం గమనార్హం. ఇండోర్ నుంచి సుమారు 500 నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను తెప్పించి ఒక్కొక్కటీ రూ.35వేల నుంచి రూ.40వేల చొప్పున రోగుల బంధువులకు విక్రయించినట్లుగా పోలీసుల విచారణలో తేలుతోంది. ఆసుపత్రిలో పనిచేసే దేవేంద్ర చౌరాసియాతో పాటు, మెడికల్ వ్యాపారి స్వపన్ జైన్‌పై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. స్వపన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా.. మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నారు. ఇదిలా ఉండగానకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల వ్యవహారంలో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ సీబీఐ దర్యాప్తు కోరుతోంది.
నకిలీ ఇంజక్షన్లలో 3 వేలు ఇండోర్‌కు, 3,500 జబల్‌పూర్‌కు చేరుకున్నాయని కాంగ్రెస్ రాజ్యభ సభ్యుడు వివేక్ ఠంఖా పేర్కొన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించకుంటే కోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేయగా, వారిలో ఆరుగురిపై జాతీయ భద్రతా చట్టం కింద ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నకిలీ రెమ్‌డెసివిర్ ముఠా సమాచారాన్ని సూరత్ పోలీసుల నుంచి అందుకున్న విజయ్ నగర్ పోలీసులు ఓ కానిస్టేబుల్‌ను వినియోగదారుడిగా రంగంలోకి దింపారు. అతడు నిందితుడిని కలిసి ఇంజక్షన్ కావాలని కోరి ముఠా బాగోతాన్ని బయటపెట్టాడు.