మొన్నటి వరకు దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరిగి పోవడంతో ప్రజలు అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికారు.  ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజల ప్రాణాలను బలి తీసుకోడానికి మరో మహమ్మారీ దూసుకు రావడం అందరిని బెంబేలెత్తిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నామనే ఆనందాన్ని కూడా మిగల్చకుండా..  అంతలోనే మరో సారి ప్రాణాపాయ స్థితికి తీసుకు వెళ్ళడానికి బ్లాక్ ఫంగస్ అనే మహమ్మారి సిద్ధమైంది.


 మనోధైర్యంతో కరోనా వైరస్ ను జయించిన ఎంతోమంది ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ ఎటాక్ తో ధైర్యాన్ని కోల్పోతున్నారు. అంతే కాదు ఎంతో మంది ప్రాణాలను సైతం తీస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్.  అయితే ఓ వైపు కరోనా ణ వైరస్ కేసులు తగ్గుతున్నాయని దేశ ప్రజానీకం మొత్తం ఊపిరి పీల్చుకుంటుంటే అటు మరో ప్రాణాంతకమైన బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని బెంబేలెత్తి పోవాల్సిన  పరిస్థితి ఏర్పడుతుంది.  దేశంలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం బ్లాక్ ఫంగస్ అనే మాట మాత్రమే దేశవ్యాప్తంగా వినిపించింది. ఇక్కడ మాత్రం ఏకంగా ఒక వ్యక్తికి మూడు రకాల ఫంగస్ లు సోకటం సంచలనంగా మారిపోయింది.



 కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తి మూడు రకాల ఫంగస్ లు సోకి చనిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో వెలుగులోకి వచ్చింది.  స్థానిక సంజయ్ నగర్కు చెందిన 59 ఏళ్ల కున్వర్ సింగ్ ఇటీవలే కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఇక మే 24వ తేదీన ఎండోస్కోపీ నిర్వహించగా బ్లాక్ అండ్ వైట్ ఫంగస్ తో పాటు ఎల్లో ఫంగస్ కూడా ఎటాక్ చేసినట్లు అటు వైద్యులు గుర్తించారు. దీంతో అతని శరీరంలోని రక్తం మొత్తం విషపూరితంగా మారి చికిత్స పొందుతూ మృతి చెందాడు కున్వర్ సింగ్. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది .

మరింత సమాచారం తెలుసుకోండి: