తెలుగు ప్రజలందరి గౌరవాన్ని ఎంతగానో పెంచి.. ప్రజల మనిషిగా, ఒక అద్భుతమైన రాజకీయ నాయకుడుగా, ప్రజా శ్రేయస్సు కోసం ఎన్నో ఏళ్ల పాటు పాటుపడిన నేత వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ప్రస్తుతం తెలుగు ప్రజలందరూ ఆయన చేసిన సేవలు స్మరించుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అటు తెలంగాణ ఏపీలోని కాంగ్రెస్ నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నేతలందరూ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.



 తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పేద ప్రజల అభ్యున్నతికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి ఎంతగానో శ్రమించారు అంటూ ప్రస్తుతం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.  ఇక ఇటీవలే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి జయంతిని పురస్కరించుకుని  తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గొప్పతనాన్ని వివరించారు  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  అంతేకాదు దివంగత ముఖ్యమంత్రి ప్రజల మనసులో గుడి కట్టించుకున్న నేత వైయస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు.



 ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  తెలుగువారిలో భారత రత్నకు అర్హతను ఉన్న ఏకైక వ్యక్తి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రమే అంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తామే నిర్మించాము అంటూ గొప్పలు చెప్పుకునే కాలేశ్వరం ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే అంకురార్పణ జరిగింది అంటూ గుర్తు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ను వైయస్సార్ కాలేశ్వరం గా మార్చారు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. ఒకవేళ వైయస్ రాజశేఖర్ రెడ్డి  లేకపోయి ఉంటే తెలంగాణ మొత్తం ఎండిపోయింది అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ysr