తెలుగుదేశం పార్టీ... ఎన్నో ఏళ్ల సుదీర్ఘ మైన అనుభవం ఉన్న పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అనేక పర్యాయాలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. అటు స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలోనూ అలాగే ప్రస్తుత టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలోనూ అధికారంలోకి వచ్చి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అయితే 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగొమ్యచరంగా తయారయింది.

 2014 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. అది బాగానే ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీ పరిస్థితి  దారుణంగా తయారయింది. రాష్ట్రం విడిపో గానే ఒక్కో సీనియర్ నాయకులు... తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలా ఒక్కొక్కరుగా టీడీపీ నుంచి అధికార పార్టీ టిఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. మరికొందరేమో ఛాన్సులు లేక టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే తాజాగా ఏకంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరమే గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో మరింత గందరగోళం ఏర్పడింది. అయితే ఆ గోడును బయటకు చెప్పడం లేదు తెలుగు తమ్ముళ్ళు.

ఇదిలా ఉండగా ఖాళీ అయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని భర్తీ చేసే పనిలో పడ్డారు అధినేత చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం తెలంగాణ అధ్యక్ష పదవి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బక్కని నర్సింహులుకు అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని పొలిటికల్ సర్కిల్ వార్త వైరల్ అవుతోంది. పార్టీ నాయకత్వం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు టిడిపి వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన బక్కని నర్సింహులు... 1994-99 లో షాద్ నగర్ ఎమ్మెల్యే గా పని చేశారు.. ఇంకా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నియామకంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరో 2 రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: