దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ఇవాళ భేటీ అయిన సంగతి విదితమే. అయితే సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి  దృష్టి కి  మొత్తం 16 అంశాలను తీసుకెళ్లారు  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అంతే కాదు..  10 అంశాలకు సంబంధించి లేఖలు అందజేసారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రధానంగా రెండు తెలుగు  రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై నరేంద్ర మోడి మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య  చర్చ జరిగింది.  

ఇక ఇప్పటికే గోదావరి, కృష్ణానదీ జలాల వివాదాలు, బోర్డు ల పరిధులను నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లను  తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించగా... శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలవిద్యుదుత్పత్తి ని తెలంగాణ ప్రభుత్వం నిలిపేయాలంటూ ఇప్పటికే మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానికి లేఖ రాసింది.   “కరోనా” సమయంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా, అంశాలపై  ప్రధానితో కేసీఆర్ చర్చించారు. “మిషన్ భగీరథ” కు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందించాలణటూ  ప్రధానిని కోరారు.

అలాగే, విభజన చట్టంలో ఉన్న పలు పెండింగ్ అంశాలపై ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి కేసీఆర్.  అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడి కి  పది వినతిపత్రాలు అందజేసారు కెసిఆర్. ఐపీఎస్ క్యాడర్ సమీక్ష ,  “ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్” ఏర్పాటు, హైదరాబాదు - నాగపూరు “ఇండస్ట్రియల్ కారిడార్”   అభివృద్ధి లాంటి అంశాలు ఉన్నాయి.  కొత్తగా ఏర్పడిన జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని.. వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు నిధులు ఇవ్వాలని ఈ లేకల్లో కోరారు సిఎం కెసిఆర్.  “ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన” రోడ్లను అభివృద్ధి చేసేందుకు నిధులు ఇవ్వాలని..  కరీంనగర్ లో “ట్రిబుల్ ఐటీ” మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కెసిఆర్.  హైదరాబాదులో ఐఐఎం ఏర్పాటు చేయాలని.. గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేయాలని లేఖల్లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: