కరోనా  వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండగా మరోవైపు నకిలీ టీకాలు  మార్కెట్లోకి ప్రవేశిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిపై హెచ్చరించగా కేంద్ర ప్రభుత్వం టీకాల ప్రామాణికతపై రాష్ట్రాలకు అనేక సూచనలు చేసింది. కోవీ షీల్డ్ కు చెందిన నకిలీ టీకాలు ఆసియా,ఆఫ్రికా మార్కెట్ లోకి వచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. వీటితో పాటు దేశంలోని అనేక చోట్ల టీకాలు వాడుకలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన కేంద్రం ముందు జాగ్రత్త చర్యగా టీకా అసలైనదా..? నకిలీదా అని తెలుసుకోవడానికి రాష్ట్రాలకు సూచనలు చేసింది. ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్న కోవీషీల్డ్ , కోవాగ్జిన్, స్పుత్నిక్ వి టీకాల తయారీ సంస్థలకు సంబంధించి ఆయా బాటిల్ లపై లేబుల్, రంగుతో పాటు తయారీ సంస్థల సమాచారం గురించిన వివరాలను తెలియజేస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది. ఎస్ఐఐ ( సీరం  ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) పేరుతో లేబుల్. కోవిషీల్డ్  బ్రాండ్ పేరు..

ట్రేడ్ మార్క్  (టిఎం ) గుర్తు. సాధారణ పాంట్ లో జనరిక్ పేరు. ఆకుపచ్చరంగులో అల్యూమినియంతో కూడిన బాటిల్ మూత. లేబుల్ పైన డిఎన్ఏ మాదిరిగా కనిపించే  గుర్తులు. లేబుల్ మీద అతి చిన్న చుక్కల రూపంలో కోవాగ్జిన్ అనే పేరు. కోవాక్సిన్ పేరులో x అక్షరం తొలి సగ భాగం ముదురు ఆకుపచ్చ రంగులో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

కోవాగ్జిన్ హోలోగ్రామ్. రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్  ప్రస్తుతం దేశీయంగానే తయారవుతుంది. రెండు బాటిల్ ల డిజైన్, వాటిపై సమాచారం మాత్రం ఒకటే. తయారీ సంస్థ పేరు మాత్రం వేర్వేరు. టీకా బాక్స్ ముందు, వెనుక భాగాల్లో సమాచారం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. సీసా లేబుల్ పై మాత్రం రష్యా భాషలో సమాచారం. ఈ విధంగా ఆయా తయారీ సంస్థల సమాచారం వయల్స్, రంగు, ట్రేడ్ మార్క్ తో పాటు లేబుల్ పై కొన్ని ప్రత్యేక గుర్తులు బట్టి అసలైన బాటిల్ ను తేలికగా గుర్తించవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: