ఒక నిర్ణయం తీసుకున్నాక చర్చలకు తావే లేదు అని వైసీపీ చెప్పడం లేదు. చెబుతోంది మీరే వినడం లేదు పవన్. ఒక నిర్ణయం తీసుకున్నాక సాధ్యా సాధ్యాలు ఆలో చిస్తూనే ఉంది. మీకూ చెప్పమనే  అంటోంది. మీరు రాజకీయ విమర్శలతో గొడవ పెద్దది చేశారు పవన్ అని చాలా మంది వైసీపీ శ్రేణులు, శ్రేయోభిలాషులు అంటున్న  మాట. వింటున్న మాట.


అదే పనిగా ఆయన మాట్లాడరు. ఎందుకనో పవన్ ఈసారి మాట్లాడుతున్నారు. ఫక్తు పొలిటీషియన్ గా మాట్లాడుతున్నారు అని అంటున్నారు పవన్ ను బాగా గమనించిన కొందరు. ఈ వివాదం  ఆగిపోతే బాగుండు అని కొందరు ప్రార్థిస్తున్నారు. పాలసీ ఉగ్రవాదం అన్నది చాలా పెద్ద పదం. ఆ పదం వాడితే కొన్ని పరిశ్రమలు కానీ కొన్ని వర్గాలు కానీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్తాయి.


సినిమా పరంగా ఏపీ సర్కారు సాయం చేస్తాననే అంటుంది. అందుకు కొంత సమయం కూడా అడిగింది. గతంలో మాదిరిగా కాకుండా ఓ పారదర్శక విధానం గురించి పట్టుబడుతోంది. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు వసూళ్లు తీసుకుని పన్నులు ఎగ్గొట్టాయన్నది సీఎం వాదన. ఇందులో పాలసీ తీవ్రవాదం అన్న పదంకు చోటేంటి? ఆయన చేయాలనుకుంటే చేస్తారు.. మీరంతా వెళ్లి వద్దండి పాత విధానంలోనే ఉంచండి అంటే పునరాలోచన చేస్తారు. పవన్ ను టార్గెట్ చేస్తున్నారు సరే అలాంటప్పుడు పవన్ మనుషుల ఓట్లు వద్దే వద్దనుకుని జగన్ మనుషులు పవన్ ను టార్గెట్ చేస్తారా? కాస్తయినా ఆలోచించాలి. పవన్ కారణంగా ఓడిపోయిన వారు కన్నా పవన్ కారణంగా గెలిచిన వారే ఎక్కువ. అదీ జగన్ పార్టీలో ఇంకా ఎక్కువ. ఓట్లు చీల్లే క్రమంలో పవన్ ముందున్నాడు. ఇవన్నీ పరిగణనలో లేకుండానే జగన్ కొత్త విధానంతో ఆటలాడుకుంటున్నారని ఎలా అనుకుంటారు? చర్చల కు చిరు వెళ్లే ఛాన్స్ కూడా ఉందనే అంటున్నారు. అప్పుడు అది పాలసీ ఉగ్రవాదం ఎలా అవుతుంది. మీరు ఇన్ని తిట్టినా కూడా చర్చలకు మేం సిద్ధమే అని కూడా వైసీపీ అంటోంది కదా! అప్పుడది పాలసీ ఉగ్రవాదం ఎలా అవుతుంది.



జగన్ ఎవరు కాదన్నా ఔనన్నా గతంలో కొన్ని వ్యాపారాలు చేశారు. వాటి కొనసాగింపే ఇప్పటి జీవితం కూడా! పవన్ మాత్రం సినిమా రంగాన్నే నమ్ముకుని ఉన్నారు. మిగతా వ్యాపారాలు ఆయనకు తెలియవు కూడా! అయితే పవన్ కన్నా జగన్ చాలా ముందు చూపుతో కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. వాటి ఫలితాలు అందుకున్నారు. ఆ కోపం పవన్ తో సమా ఆయనకు చెందిన అందరిలోనూ ఉండవచ్చు. కానీ పవన్  మాత్రం ప్రశ్నిస్తున్న పాలసీ ఉగ్రవాదం ఏంటన్నదే అర్థం కావడం లేదు. అవును! ఆయన ఎప్పటి నుంచో కొన్ని ఆలోచనలు ప్రతిపాదనల రూపంలో తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో తన సొంత వారికి సాయం కూడా చేశారు. ఇప్పుడు సినిమా టిక్కెట్ల ఆన్లైన్ వివాదం పాలసీ తీవ్రవాదం అంత పెద్దదేమీ కాదు. కాస్త ప్రభుత్వంతో మాట్లాడుకుంటే సరిపోతుంది. ఆయన అదే పనిగా ఓ వర్గాన్ని ఎందుకని టార్గెట్ చేస్తారు? ఆయనకూ నిర్మాతలు ఉన్నారు కదా! అప్పుడు వాళ్ల క్షేమం జగన్ కు పట్టదా? అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. సిమెంట్ వ్యాపారంలో జగన్ రాణిస్తే, సినిమా వ్యాపారం లో పవన్ మంచి పేరు తెచ్చుకున్నారు. సొంతంగా సినిమాలు చేయకున్నా హీరోగా చేసిన సినిమాలు కాస్తో కూస్తో ఆయనను నిలబెట్టాయి. దీనిని కొనసాగిస్తూ రాణించాల్సిన పవన్ ఎందుకని వివాదాల జోలికి పోతున్నారు. పోనీ ఏదయినా ఒక ఇష్యూ తీసుకుంటే ఆఖరి దాకా దాని అంతు చూసే దాకా నిలబడతారా అంటే అదీ లేదు. గతంలో కూడా ఇలానే కొన్ని వివాదాలపై మాట్లాడి తరువాత మౌనం దాల్చారు అని అంటారు కొందరు వైసీపీ అభిమానులు. ఆయనకు సంబంధం లేని విషయాలు ఎందుకని నెత్తినేసుకుంటారు అని ఇంకొందరు పవన్ శ్రేయోభిలాషులు అంటున్నారు.



చాలా రోజుల నుంచి పవన్ ను జగన్ టార్గెట్ చేస్తూనే ఉన్నాను. జగన్ పై కూడా అదే విధంగా అదే స్థాయిలో అదే లాంగ్వేజీలో తనదైన కౌంటర్లు ఇస్తున్నారు పవన్. ఇక పవన్ సాధించేదేంటి? ప్రజా సమస్యలు మాట్లాడడం మానుకుని, వ్యక్తిగత తగాదాల జోలికి ఎందుకు వీళ్లంతా వెళ్తున్నారని? దీనిపై ఇప్పటికే ఇరు వర్గాలు పోలీసులను సైతం ఆశ్రయించి కొట్టుకోవడంలో ఆంతర్యం ఏంటి?  


మరింత సమాచారం తెలుసుకోండి:

tg