ఈటల రాజేందర్ కు నీతి, జాతిలేదంటూ ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. గెల్లు శ్రీనివాస్ గెలుపు శ్రీను కాబోతున్నాడని చెప్పారు. ఈటెల ను పెంచి,పెద్ద చేసిన కేసీఆర్ పై విమర్శలు చేయడం సరికాదన్నారు. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అవడంతో  తొలిరోజే నామినేషన్ వేశారు టిఆర్ఎస్ అభ్యర్థి. అభ్యర్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ నామినేషన్ దాఖలు చేయాలన్నారు రిటర్నింగ్ ఆఫీసర్. నామినేషన్ వేయడానికి అభ్యర్థులతో పాటు మరో ఇద్దరికి మాత్రమే పర్మిషన్ ఉన్నట్లు చెప్పారు. అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి  గా రెండు సైట్లతో నామినేషన్ వేశారు గెల్లు శ్రీనివాస్ యాదవ్.

ఈటెల రాజేందర్ కు నీతి జాతి లేదన్నారు మంత్రి హరీష్ రావు. ఈటెల ను తోబుట్టువులా గా చూసిన కేసీఆర్ కు గోరి కడతానని అనడం ఎంతవరకు సబబు అన్నారు . గతంలో విమర్శలు చేసిన బిజెపిలో ఇప్పుడు ఎలా చేరారని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి లో టిఆర్ఎస్ ధూమ్ దాం లో హరీష్ పాల్గొన్నారు. సిద్ధాంతాలు వదిలేసి ప్రజలకు ఏం మేలు చేస్తనని బీజేపీలో చేరారో చెప్పాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున హైదరాబాద్ నియోజకవర్గంలో నామినేషన్ వేస్తామన్నారు.

 కెసిఆర్ ప్రభుత్వంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిగిన  అన్యాయాలకు హుజరాబాద్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని వాళ్లు అన్నారు. సాగర్ ఉప  ఎన్నికల తర్వాత వారిని విధుల్లోకి తీసుకుంటామని,  ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత విధుల్లోకి తీసుకుంటామని చెప్పి  మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి మమ్మల్ని మోసం చేయడం జరిగింది అందుకే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసి టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని వాళ్లు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: