ఒక‌విధంగా విష్ణును ట్రోల్  చేసింది ప‌వ‌న్ టీం. జ‌గ‌న్ పై ఉన్న కోపం కార‌ణంగా ఆ ప‌ని చేసింది. అది నిజంగా త‌ప్పో ఒప్పో రేపు ప‌డే ఓట్ల ఆధారంగా తేలిపోతుంది. జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్ లో జ‌ర‌గ‌నున్న పోలింగ్ కు అంత సిద్ధం అవుతున్న త‌రుణంలో భారీ వాన క‌బురు ఒక‌టి హ‌డ‌లెత్తిస్తోంది.  క‌నుక అదెలా ఉన్నా కూడా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం అంటారా లేదా వాయిదా వేస్తారా అన్న‌ది స్ప‌ష్ట‌త లేదు. కానీ వాన సంగ‌తి ఎలా ఉన్నా మా క‌థ‌లో ఇద్ద‌రు రాజ‌కీయ నాయ‌కులు కీలకం అన్న‌ది సుస్ప‌ష్టం. జ‌గ‌న్, కేటీఆర్ వీరితో పాటు బాల‌య్య కూడా! హిందూపురం ఎమ్మెల్యేగా బాల‌య్య కూడా విష్ణు వైపే.. జ‌గ‌ప‌తి బాబు విష్ణు వైపే.. మొత్తానికి అంతా విష్ణు వైపే అని తేలిపోయింది.

ఇంకా చెప్పాలంటే........

జ‌గ‌న్ మా బావ అని అంటున్నారు విష్ణు. కేటీఆర్ నా స్నేహితుడు అని అంటున్నారు ప్ర‌కాశ్ రాజ్. విడ్డూరం ఈ ఇద్ద‌రూ రెండు తెలుగు రాష్ట్రాల నాయ‌కుల‌కూ మంచి స్నేహితులే! మీడియా ముందు బిల్డ‌ప్పు మాట‌లు ఎన్న‌యినా చెప్ప‌వ‌చ్చు..ఎవ్వ‌రూ కాద‌నరు కానీ వాటి నిజం ఎంత అన్న‌ది తేలాలి. నిజాయితీ చూడాలి. మా ఎన్నిక‌లు ప‌ట్టించుకోం అంటారు కానీ అదంతా అబ‌ద్ధం.



తెర‌వెనుక జ‌గ‌న్ మ‌నుషులు ప‌నిచేస్తున్నార‌న్న‌ది వాస్త‌వం. విజ‌య్ చంద‌ర్ మ‌నుషులు విష్ణుకు సాయం చేస్తున్నార‌న్న‌దీ నిజం.
అదేవిధంగా రెడ్డి కమ్యూనిటీకి చెందిన కొంద‌రు నటులు బాహాటంగానే విష్ణు వైపు ఉన్నారు. క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గం అంతా ఆయ‌న వైపే.. కాస్తో కూస్తో క‌మ్మ సామాజిక వ‌ర్గం కూడా విష్ణు వైపే.. క‌నుక గెలిచేది విష్ణునే! అందులో డౌటే లేదు. ప్ర‌కాశ్ రాజుకు ఎంద‌రి పెద్ద‌ల స‌హ‌కారం ఉన్నా కూడా నెగ్గుకు రావ‌డం క‌ష్టం అని తేలిపోయింది. ఇప్పుడు కేటీఆర్ మ‌నుషులు కొంద‌రు ఇండ‌స్ట్రీలో ఉన్నారు. వీరంతా ప్ర‌కాశ్ రాజ్ వైపు ఉన్నారు. చిరంజీవి ఎంత మ‌ద్ద‌తు ఇచ్చినప్ప‌టికీ విష్ణు మాదిరిగా పెద్ద‌ల ఆశీస్సులు ప్ర‌కాశ్  
రాజ్ అనే న‌టుడు పొందేలా చేయ‌లేక‌పోయార‌న్న‌ది వాస్త‌వం. దీంతో పాటు ప్ర‌కాశ్ రాజ్ అహంకార‌పూరిత వ్యాఖ్య‌లే ఆయ‌న కొంప ముంచ‌నున్నాయి కూడా!


మరింత సమాచారం తెలుసుకోండి: