రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న హాయాంలో జిల్లాకో బోధ‌నా స్ప‌త్రి ఉండాలి అన్న నియ‌మంతో ఉమ్మ‌డి ఆంధ్రాలో మూడు చోట్ల రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (రిమ్స్) ను ఏర్పాటు చేశారు. తెలంగాణ‌లో ఒక‌టి, ఆంధ్రాలో రెండు ఉన్నాయి. క‌డ‌ప‌లో ఒక‌టి, మారుమూల ప్రాంతం అయిన శ్రీ‌కాకుళం జిల్లాకు ఒక‌టి ఇచ్చారు. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు సంబంధించి అప్ప‌టి  రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కృషి కూడా చాలా ఉంది. రిమ్స్ ఏర్పాటై ఏళ్లు గ‌డుస్తున్నా సంబంధిత పాల‌నా వ్య‌వ‌స్థ గాడిన ప‌డ‌లేదు. ఆస్ప‌త్రి అభి వృద్ధి క‌మిటీలు అయితే మారుతున్నాయి కానీ రిమ్స్ ను బాగు చేయ‌లేక‌పోతున్నాయి.


ముఖ్యంగా నిధుల కొర‌త వెన్నాడుతోంది. సిబ్బంది కొర‌త వెన్నాడుతోంది. సీఎం జ‌గ‌న్ వ‌చ్చాక కొన్ని ప‌నులు చేప‌డ‌తార‌ని భావించినా, అవేవీ జ‌ర‌గ‌కుం డానే పోయాయి. ముఖ్యంగా నిర్వ‌హణ‌లోనే కాదు టీచింగ్ స్టాఫ్ ను నియామ‌కంలోనూ ఎటువంటి చర్య‌లూ లేవు. బోధ‌న సిబ్బం ది లేక త‌రుచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక్క‌డ పీజీ క్లాసెస్ నిర్వ‌హ‌ణ‌కు కూడా అనుమ‌తులు ఉన్నా, ఆశించిన స్థాయిలో త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ లేద‌న్న‌ది ఓ విమ‌ర్శ.

కరోనా స‌మ‌యంలో ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుకు అప్ప‌టి క‌లెక్ట‌ర్ నివాస్ చేసిన కృషి ఫ‌లించింది. అదేవిధంగా ఎంపీ రామూ చొర‌వ‌తో చిన్న పిల్ల‌ల వార్డు ఒక‌టి ప్ర‌త్యేకంగా దాతల స‌హ‌కారంతోనే ఏర్పాట‌యింది. 40 ఆక్సిజ‌న్ బెడ్ల‌తో రామూ, ఆయ‌న స్నేహితులు క‌లిసి  రిమ్స్ కు ఈ సౌక‌ర్యం క‌ల్పించారు. కరోనా సమ‌యంలో జిల్లాకు పెద్దాస్ప‌త్రిగా మంచి సేవ‌లు అందించినప్ప‌టికీ పొరుగు సేవ‌ల కింద తీసుకున్న సిబ్బందికి ఇప్ప‌టికీ జీతాలు లేవు. ఇందులో కొంద‌రు న‌ర్సింగ్ స్టాఫ్ ను తీసేశారు కూడా! అప్ప‌టిక‌ప్పుడు కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న త‌మ‌ను తీసుకుని త‌రువాత ఇంటికి పంపెయ్య‌డం ఎంత వ‌ర‌కూ స‌బ‌బు అన్న ప్ర‌శ్న ఒక‌టి సంబంధిత వ‌ర్గాల నుంచి వ‌స్తోంది. ముఖ్యంగా రోగుల‌కు మంచి ఆహారం అంద‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌లో త‌రుచూ ఏదో ఒక స‌మ‌స్య వెలుగు చూస్తూనే ఉంది.


వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా రిమ్స్ ను తనిఖీ చేసినా త‌రువాత ప‌రిణామాలు అన్నీ మామూలే! ముఖ్యంగా రోగుల సహాయ‌కుల‌కు ఇక్క‌డ ఆహారం అందించే ఏర్పాటు స‌త్య సాయి సంస్థ చేసిన‌ప్ప‌టికీ ఆ సంస్థ పూర్తి స్థాయిలో ప‌నిచేయ‌లేకపోతోంది. దీంతో కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు త‌మ ప‌రిధిలో త‌మ‌కు ఉన్నంత‌లో రోగుల స‌హాయ‌కులు ఆక‌లితో అల‌మటించ‌కుండా భోజ‌న ఏర్పాటు చేస్తున్నారు. మార్చురీ సిబ్బందికి కూడా స‌రైన విధంగా జీతాలు లేవు. ఇక్క‌డ కూడా కొంద‌రు కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో ప‌నిచేస్తున్నా, వాళ్ల‌యితే త‌ప్ప‌క ఉంటున్నారు కానీ అధికారుల తీరు మాత్రం ఏ విధంగానూ
మార‌డం లేదు. దీంతో వీళ్ల త‌ల‌రాత‌లు మార‌డం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: