గత ఎన్నికల్లో ఘోర ఓటమి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ చాలా నియోజకవర్గాల్లో ఘోరంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అసలు పలు నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకులే లేరు. అయితే ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అవుతుంది...ఈ క్రమంలోనే చంద్రబాబు పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లని నియమిస్తూ వస్తున్నారు. అలాగే యాక్టివ్ గా లేని నాయకులని కూడా పక్కనబెట్టేసి కొత్తవారికి ఛాన్స్ ఇస్తున్నారు.

అయితే అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులని నియమిస్తున్న చంద్రబాబు...పార్లమెంట్ స్థానాలని వదిలేస్తున్నారు. ఆ స్థానాల్లో ఎన్నికల ముందు నాయకులని పెట్టడం కంటే...ఇప్పుడే నాయకులని నియమిస్తే పార్లమెంట్ స్థానాల్లో టి‌డిపి బలోపేతం అవుతుంది. గత ఎన్నికల్లో టి‌డి‌పి 25 పార్లమెంట్ స్థానాల్లో 22 చోట్ల ఓడిపోయింది. 3 చోట్ల మాత్రమే గెలిచింది. ఇక 3 స్థానాలని పక్కనబెడితే...22 స్థానాల్లో చాలా చోట్ల టి‌డి‌పికి నాయకులు లేరు. పార్లమెంట్ అధ్యక్షులు ఉన్నారు గానీ, ఇంచార్జ్‌లు లేరు.

శ్రీకాకుళంలో ఎలాగో రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు...ఇక విజయనగరం పార్లమెంట్ స్థానంలో మళ్ళీ అశోక్ గజపతి రాజు పోటీ చేస్తారని తెలుస్తోంది. అలాగే విశాఖపట్నం పార్లమెంట్‌లో బాలయ్య చిన్నల్లుడు భరత్ పోటీ చేయనున్నారు. కానీ అనకాపల్లి, అరకు స్థానాల్లో నాయకులు లేరు. ఇక అమలాపురం స్థానంలో బాలయోగి తనయుడు హరీష్ పోటీ చేయడం ఖాయమే. కానీ రాజమండ్రి, కాకినాడ స్థానాల్లో టి‌డి‌పి తరుపున ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు.

ఇటు వస్తే విజయవాడలో ఎంపీగా కేశినేని నాని ఉన్నారు...అటు మచిలీపట్నంలో మళ్ళీ కొనకళ్ళ నారాయణ పోటీ చేయొచ్చు. గుంటూరులో గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నారు.. నరసారావుపేటలో రాయపాటి సాంబశివరావు ఫ్యామిలీ నుంచి ఎవరోకరు పోటీ చేసే ఛాన్స్ ఉంది. బాపట్లలో ఓడిపోయిన మాల్యాద్రి అడ్రెస్ లేరు. ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు పార్లమెంట్ స్థానాల్లో టి‌డి‌పికి నాయకులు కావాలి.

తిరుపతిలో పనబాక లక్ష్మీ, అనంతపురంలో జే‌సి పవన్, హిందూపురంలో నిమ్మల కిష్టప్ప, నంద్యాలలో మాండ్ర శివనందరెడ్డి, కర్నూలులు కోట్ల సూర్యప్రకాశ్‌లు ఉన్నారు. కడప పార్లమెంట్ స్థానంలో నాయకుడు లేరు. అంటే పలు పార్లమెంట్ స్థానాల్లో టి‌డి‌పికి నాయకులు లేరు.  

మరింత సమాచారం తెలుసుకోండి: