
-
abhinay
-
Audimulapu Suresh
-
BHUMANA KARUNAKAR REDDY
-
BOTCHA SATYANARAYANA
-
Chakram
-
Chiranjeevi
-
Chittoor
-
Cinema
-
Coronavirus
-
KARANAM BALARAMA KRISHNA MURTHY
-
MP
-
Nellore
-
paritala ravindra
-
Paritala Sunitha
-
Party
-
Reddy
-
Service
-
Srikakulam
-
srinivas
-
Tammineni Sitaram
-
Tirupati
-
Vijayanagaram
-
vishal krishna
-
Vizianagaram
ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌ల వారసులు ఇప్పటికే వారి వారి తండ్రుల తరఫున జోరుగా తిరిగేస్తున్నారు. ఆదిమూలపు సురేష్ కుమారుడు విశాల్ ఈ ఏడాది ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఇచ్చిన విందులో జిల్లాకు చెందిన అందరు నేతల వారసులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు కూడా. బాలినేని శ్రీనివాస్ కుమారుడు ప్రణీత్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి అయితే పోటాపోటీగా నెల్లూరు ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేశారు. కొంతమంది నేతల వారసులు అయితే చట్టసభలకు పోటీ చేసి ఓడారు కూడా. కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్, పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వీళ్లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు కూడా. ఇక కొంతమంది వారసులు అయితే ఇప్పటికే చట్టసభలకు ఎన్నికయ్యారు కూడా. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి తిరుపతి కార్పొరేషన్ డిప్యూటి మేయర్‌గా ఉన్నారు. ఇక బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.