నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని చెప్పొచ్చు. అయితే విద్యారంగంలో తిరుగులేని పొజిషన్‌లో ఉన్న నారాయణ..రాజకీయ రంగంలో మాత్రం కాస్త విఫలమయ్యారనే చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో రాజకీయం చేయడంలో నారాయణ ఫెయిల్ అయ్యారు. మొదట నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటూ వచ్చిన నారాయణ....2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక...చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా మారారు.

నారాయణకు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ, క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఇక మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ..అమరావతి ఏర్పాటులో ఎలాంటి కీలకపాత్ర పోషించారో అందరికీ తెలిసిందే. భూముల సమీకరణని దగ్గర ఉండి చూసుకున్నారు. అయితే ఐదేళ్ల పాటు నారాయణ రాజకీయం బాగానే నడిచింది. కానీ 2019 ఎన్నికల నుంచే నారాయణ పోలిటికల్ కెరీర్ ఫెయిల్యూర్ దిశగా నడిచింది. ఆ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు.


ఇటు టీడీపీ కూడా ఓడిపోయి అధికారం కోల్పోయింది.. అక్కడ నుంచి నారాయణ ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం మానేశారు. ఇటు తన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచినా సరే, రాజకీయాల్లో కనిపించడం లేదు. ఆయన బాటలోనే నారాయణ కూడా వెళుతున్నారు. ఇంతవరకు టీడీపీలో కనిపించలేదు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నిక జరుగుతున్నా సరే బయటకు రాలేదు. అయితే నారాయణ..తన వియ్యంకుడుతో కలిసి పార్టీ మారిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా వచ్చింది.

కానీ అది జరగడం లేదు..ఆయన పార్టీ మారడం లేదు. అయితే మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని టీడీపీలో చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే నెల్లూరు సిటీకి పోటీ చేస్తారని, జిల్లా రాజకీయాల్లో టాక్. ఇప్పుడు సిటీకి ఇంచార్జ్‌గా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని తప్పించి నారాయణకు సీటు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి నారాయణ మళ్ళీ ఎంట్రీ ఇస్తారో లేదో.  

మరింత సమాచారం తెలుసుకోండి: