ప్ర‌స్తుతం ఉన్న ట్రెండ్‌లో  సోషల్ మీడియాలోనే మ‌నుషులు న‌వ్వుతున్నారు.. ఏడుస్తున్నారు.. అరుస్తున్నారు క‌రుస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌పంచ జ‌నాభాలో దాదాపు 40 శాతం మంది సోష‌ల్ మీడియాలో న‌డుపుతున్న‌ట్టు ఓ అంచెనా కూడా వేసారు. సుమారుగా రోజుకు స‌గ‌టున 2 నుంచి 3 గంట‌ల  స‌మ‌యం వ‌ర‌కు సోష‌ల్‌మీడియాలోనే గ‌డుపుతున్న‌ట్టు ప‌లు నివేదిక‌లు పేర్కొంటున్నాయి.

జీవితంలో ఇంత‌గా భాగ‌మైన ఈ సోష‌ల్ మీడియా మ‌నిషికి భారంగానే మారుతుందా..?  లేక మాన‌వుల ఆలోచ‌న‌లు, భావాలు, ఉద్వేగాలు, బంధాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. దాదాపు ద‌శాబ్ద కాలం కింద‌టే పుట్టుకొచ్చిన‌ది. ఇది మ‌నిషి భావోద్వేగాల గురించి క‌చ్చితంగా అంచెనా వేయ‌గ‌ల పూర్తిస్థాయి ప‌రిశోధ‌న‌లు ఇంకా జ‌ర‌గ‌లేదు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ప‌రిశోధ‌న‌లు అన్నీ దాదాపు ఫేస్‌బుక్ చుట్టు ఉన్నాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప‌రిశోధ‌న‌లు మ‌రింత లోతుగా జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా.. తెలంగాణ సాంస్కృతిక‌ ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ సోష‌ల్ మీడియాపై స్పందించారు.

ముఖ్యంగా సామాజిక మాధ్య‌మాలు ఎక్కువ‌గా చెడును ప్ర‌చారం చేస్తున్నాయ‌ని వెల్ల‌డించారు. అయితే పుస్త‌కాలు మాత్ర‌మే మంచిని బోధిస్తాయి అని చెప్పారు. యువ‌త ముఖ్యంగా వార్తా ప‌త్రిక‌ల‌లో వ‌చ్చే ఎడిట్ పేజీ వ్యాసాల‌ను చ‌ద‌వాల‌ని.. దాని ద్వారా స‌మాజాన్ని వాస్త‌వికంగా విశ్లేషించే దృక్ప‌థం ఏర్ప‌డుతుంద‌ని సూచించారు. దోమ‌ల్‌గూడ‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నేరెళ్ల వేణుమాద‌వ్ ప్రాంగ‌ణంల‌ని చిందు ఎల్ల‌మ్మ వేదిక‌పై జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి హైద‌రాబాద్ జాతీయ పుస్త‌క మ‌హోత్స‌వాన్ని శ్రీ‌నివాస్‌గౌడ్ ఆరంభించారు.తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటులో పుస్త‌కం ప్ర‌ధాన పాత్ర పోషించింద‌ని గుర్తు చేసారు.
 
హైద‌రాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీకి శాశ్వ‌త కార్యాల‌యాన్ని కేటాయించాల‌ని తెలంగాణ సాహిత్య అకాడ‌మీ చైర్మ‌న్ జూలురు గౌరీశంక‌ర్ మంత్రిని కోరారు. అయితే ర‌వీంద్ర‌భార‌తిలో కార్యాల‌యానికి స్థ‌లం కేటాయిస్తాం అని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ స‌మాచారాన్ని వికీపీడియాలో తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న‌ట్టు ఐటీశాఖ కార్య‌ద‌ర్శి జ‌యేష్‌రంజ‌న్ వెల్ల‌డించారు. మొత్తానికి సోష‌ల్ మీడియాలో చెడు ఎక్కువగా.. మంచి త‌క్కువ‌.. పుస్త‌కాల్లో మొత్తం మంచినే అని స్ప‌ష్టం చేసారు మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: