
ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా కృష్ణా జిల్లాలోనే ఉండటం విశేషం. తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ ఓడిపోవాలని కోరుకుంటున్న ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు... గుడివాడ నుంచి మంత్రిగా ఉన్న కొడాలి నాని తో పాటు... గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. ఇద్దరు నేతలను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని తెలుగుదేశం క్యాడర్ కసితో రగులుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు గన్నవరంలో వంశీకి బలమైన ప్రత్యర్థిని సెట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ నేత ఎవరో కాదు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గా ఉన్న పార్టీ సీనియర్ నేత గద్దే రామ్మోహన్ గద్దె.
రామ్మోహన్ సొంత నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం. 1994 లోనే ఎన్టీఆర్ ఆయనకు సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత అయినా విజయవాడ ఎంపీగా గెలవడం తోపాటు... విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గా రెండు సార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ ను గన్నవరం బరిలో దింపుతారని... చంద్రబాబు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది.
వంశీని అక్కడ ఓడించాలంటే గద్దె రామ్మోహన్ వల్లే సాధ్యమవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారట. మరి చంద్రబాబు నిర్ణయానికి రామ్మోహన్ ఓకే చెప్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఏదేమైనా గద్దే గన్నవరంలో పోటీ చేస్తే వంశీకి బలమైన ప్రత్యర్థి అవుతారు అనటం లో సందేహం లేదు.