గంటా శ్రీనివాస రావు... తెలుగు రాజకీయాలలో  పరిచయం అవసరం లేని రాజకీయ వేత్త. ప్రజలే ఆయన జీనవాడి. ప్రజలు  ఏ వైపు ఉంటే ఆయన  ఆ పార్టీ వైపు ఉంటారు. ఎక్కడ ఉన్నా తనదైన మార్కును ప్రదర్శిస్తారు. అది ఆయన నైజం అని అతని సన్నిహితులు చెప్పుకుంటారు.  ప్రస్తుతం తెలుగు దేశం ఎం.ఎల్ ఏ గా ఉన్నా, ఆయన  ఆ పార్టీకి దూరంగా ఉన్నారని సోంత పార్టీ వ్యక్తలే పేర్కోంటుంటారు. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గోన్నారు.  టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు నివాళులర్పించారు. ఎక్కడో తెలుసా ?

  విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు గా పేరుగాంచిన సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ  నందమూరి తారకరామారావు 26వ వర్ధంతి సందర్భంగా   ఆర్కే బీచ్ లో ఎన్ టి ఆర్ విగ్రహానికి  గంటా శ్రీనివాస రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రారంభించారు,  ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ  తెలుగు జాతి ఖ్యాతిని చాటి చేపింది స్వర్గీయ ఎన్టీఆర్ అనిఅన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లో నే అధికారంలోకి వచ్చింది అంటే అది ఎన్టీఆర్ ఘనత అని పేర్కోన్నారు, ఆయన ఆశయాలే మాకు స్ఫూర్తి అని అన్నారు. జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి అని స్లోగన్ లను పార్టీ శ్రేణులచే పలికించారు. అ తరువాత విలేకరులతో మాట్లాడారు. 2024 ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉంది. పార్టీకి అత్యున్నత మైన  కమీటీ ఉంది... ఆ కమీటీ నిర్ణయానికి అనుగుణంగా నే ఎన్నికల్లో ముందుకు వెళ్తాము  అని ప్రకటించారు. ఈ కార్యక్రమం లో మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు, పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు దువ్వరపురామారావు, దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్ గండి బాబ్జీ,  విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ , సిహెచ్ వి పట్టాభి రామ్. వి.స్.న్.మూర్తి యాదవ్. ముఖ్య నాయకులు  పాల్గొన్నారు. ఈ విషయాన్ని గంటా శ్రీనివాస రావు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు కూడా . ఎన్టీఆర్ కు ఘణ నివాళి అని అందులో పేర్కోన్నారు. ఆయన  గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన విషయం మనం ఇక్కడ గమనించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: