కేంద్రానికి మంత్రి కేటీఆర్ మరో లేఖ రాశారు.  ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టు కి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మేక్ ఇన్ ఇండియా ఈ కార్యక్రమంలో భాగంగా ఫార్మా రంగంలో అద్భుతమైన ప్రగతికి హైదరాబాద్ ఫార్మాసిటీ ఒక కేంద్రంగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ ఫార్మా సిటీ కి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హోదాకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో హైదరాబాద్ ఫార్మాసిటీ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల తో మాట్లాడిన సందర్భంగా ఈ ప్రాజెక్టుకు జాతీయ ప్రాధాన్యత ఉన్నట్లు అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 

ఈ ప్రాజెక్టు ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ కంపెనీల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు అరవై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడంతో పాటు సుమారు 5.6 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టు మౌళిక వసతుల కల్పనకు సంబంధించి భారీ ఎత్తున నిధులు కేటాయించాలని కోరారు. మాస్టర్ ప్లాన్ కోసం 50 కోట్ల రూపాయలు, రోడ్ల లింకేజీ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రైల్వే కనెక్టివిటీ వంటి ఎక్స్టర్నల్ మౌలిక వసతుల కోసం 1399 కోట్ల రూపాయలు, జీరో లిక్విడ్ డిస్ఛార్జ్ ఆధారంగా పనిచేసే ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి అంతర్గత మౌలిక వసతుల కోసం మరో 35 54 కోట్ల రూపాయలను, మొత్తంగా అన్ని కలిపి హైదరాబాద్ ఫార్మా సిటీకి 5003 కోట్లని ఈ బడ్జెట్లో కేటాయించాలని మంత్రి కేటీఆర్, నిర్మల సీతారామన్ ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr