ఒకప్పుడు భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో భారత్లోకి ఎంతో మంది ఉగ్రవాదులు చొరబడే వారు ఎన్నో కుట్రలతో మారణహోమం సృష్టించేవారు. ఇక ఉగ్రవాదులకు అక్కడి ప్రజల మద్దతు కూడా ఉండటంతో వారిని కనిపెట్టడం భారత ఆర్మీ కి ఎంతో కష్టతరంగా మారేది. కానీ ఇటీవలి కాలంలో మాత్రం కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ప్రజల్లో మార్పు వచ్చింది. ఉగ్రవాదులకు సహకరించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.. అదే సమయంలో భారత ఆర్మీ ఎంతో అప్రమత్తమైంది.. ఇంటిలిజెంట్ సమాచారంతో వివిధ ఆపరేషన్స్ నిర్వహించి ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేస్తూ మట్టుబెడుతుంది.



 ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే వందల మంది ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టు పెట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ లలో వివిధ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఎంతో మంది కీలక కమాండర్లు మటాష్ అవుతున్నారు. ఇకపోతే ఇటీవలే పుల్వామా వద్ద భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఏకంగా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు భారత ఆర్మీ. పుల్వామా లోని నైరా గ్రామం వద్ద ఉగ్రవాదులు  దాక్కుని ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే 55 మంది రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, గరుడ్ కమాండర్స్  ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో జల్లెడ పట్టడం మొదలు పెట్టారు.


 ఇక ఉగ్రవాదులు ఉన్న ఇంటిని గుర్తించి అక్కడ ఉన్న స్థానికులు అందరి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇక ఈ విషయాన్ని గ్రహించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా భద్రతా దళాలపై కాల్పులను తెగబడ్డారు. ఇక ఈ కాల్పుల్లో కమాండర్  సందీప్ జూజారియా శరీరంలోకి ఏకంగా 2 బుల్లెట్లు చొచ్చుకు పోయాయ్. ఒకటి చాతి సమీపంలో మరొకటి ఎడమ చేతిపై దిగాయి. ఇలా తూటాలు శరీరాన్ని చీల్చుతున్నప్పటికి ఆ కమాండర్ మాత్రం వీరత్వాన్ని చాటాడు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఉగ్రవాదులతో పోరాటం చేశాడు. ఇక ఈ కమాండర్ ధైర్యసాహసాలకు పోరాట పటిమకు యావత్ భారత్ సెల్యూట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: