రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది ఎవ్వరూ ఊహించలేరు. ఇక్కడ మనవాళ్ళు బయట వాళ్ళు అంటూ చెప్పుకోవడానికి వీలుండదు. కొన్ని సార్లు రాజకీయ స్వార్థం కోసం సొంత వాళ్లే మోసం చేసిన సందర్భాలు అనేకం అని చెప్పాలి. కాగా దేశ వ్యాప్తంగా రాజకీయాలు మంచి కాక మీద ఉన్నాయి. రీసెంట్ గా ఆర్థిక మంత్తి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్ గురించి ఆయా రాష్ట్రాలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోయే కొన్ని రోజుల్లో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. వాటి కోసం ఇప్పటి నుండే ప్రణాలికలు రచించుకుంటున్నారు రాజకీయ పార్టీలు. అందులో భాగంగా ఇప్పుడు ఒక అంశం వైరల్ గా మారింది.

వచ్చే నెలలో కేంద్ర పాలిత ప్రాంతం అయిన అండమాన్ నికోబార్ దీవుల్లో మున్సిపల్ మరియు పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలలో బద్ద శత్రువులుగా ఉన్న టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నారు అని తెలుస్తోంది. అయితే రాష్ట్రాలను బట్టి పార్టీల మధ్యన బంధాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడ అదే విధంగా అండమాన్  నికోబార్ లో ఇరు పార్టీల మధ్యన ఉన్న సఖ్యతతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే టీడీపీ అధ్యక్షుడు మాణిక్య రావు యాదవ్ మరియు ఏఎన్టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్ లు పోర్ట్ బ్లైర్ లోని గాంధీ భవన్ లో కలిశారు.

ఇక్కడే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకున్నారు అని తెలుస్తోంది. వచ్చే నెల 6 వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అదే విధంగా దీని ఫలితాలను మార్చి 8 న ప్రకటించనున్నారు. వీరు మాట్లాడుతూ ఈ ఎన్నికలలో ఖచ్చితంగా గెలుపు మాదే అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల పోర్ట్ బ్లెయిర్ మునిసిపాలిటి లో 2, 5 మరియు 16 వార్డుల్లో టీడీపీ పోటీ చేయనుందని తెలిపారు. ఇది నిజంగా శుభ సూచకం అని చెప్పాలి. ఇదే విధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోనూ జరిగితే అది ఒక వండర్ అని  చెప్పాలి. మరి ఏమి జరగనుంది అనేది తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: