
ఆ వివరం ఈ కథనంలో..
మంచి వాడు అనే పదం దగ్గర ఆగిపోవడం పద్ధతి కాదు.మంచి వాడు అన్న పదం దగ్గర ఉన్న విస్తృతి ఎంతో చెప్పగలగాలి. మంచి వాడైన జగన్ వీలున్నంత వరకూ ఉద్యోగులకు నచ్చజెప్పే ప్రయత్నమే చేయండని చెబుతున్నారు.అంతేకాదు ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటే చాలు ఉద్యోగుల సమస్యలు కూడా తీరిపోతాయి.అందుకే జగన్ మొదట్నుంచి సామరస్య పూర్వక ధోరణిలోనే వెళ్తున్నారు.తన తరఫు వాదన వినిపిస్తూనే,ప్రభుత్వ పెద్దల ద్వారా చెప్పిస్తున్నారు కూడా! ఇప్పుడున్నపరిస్థితుల్లో ఎవ్వరిపై ఏ కేసులూ వద్దనే అంటున్నారు.ఉద్యోగులపై కేసులు నమోదు చేయవచ్చు కానీ ఆయన చేయరు.ఆయన పద్ధతి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోండి అని చెప్పడమే!
కొద్ది రోజులు ఆగితే కొన్ని
అపరిష్కృతాలు పరిష్కృతాలే!
పీఆర్సీ పోరులో కొన్ని కీలక ఘట్టాలు ఉన్నాయి.వాటిన్నింటికీ సమాధానం చెప్పేందుకు సజ్జల రామకృష్ణా రెడ్డి ఎక్కువగానే కృషి చేస్తున్నారు.అన్నీ కుదిరితే ఇటీవల విడుదల చేసిన జీఓల స్థానంలోనే కొత్త జీఓలు రావొచ్చు.లేదా ఏదో ఒక సవరణ జరగవచ్చు. ఆ దిశగా ఏపీ సర్కారు చేస్తున్న ఆలోచన పరిపక్వతను ఆపాదించుకునే ఉందని, ఉంటుందని ఉద్యోగ వర్గాలు కొన్ని చెబుతున్నాయి.
సీఎం చొరవ ఫలించడం ఖాయం!
ఇక పీఆర్సీ విషయమై ముఖ్యంగా ఫిట్మెంట్ పై కూడా ఓ సమీక్ష చేసి, వీలున్నంత వరకూ ఐఆర్ రికవరీ చేయకుండా ఉంటే మేలు అన్న ఉద్దేశంతోనే ఉన్నారు సీఎం. అదేవిధంగా పెండింగ్ డీఏలు క్లియర్ చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ఉద్యోగులకు మరింత చేరువుగా ఉండేందుకు చర్యలు చేపట్టనున్నారు.చలో విజయవాడ సందర్భంగా ఎక్కడా ఏ పోలీసు కూడా లాఠీ ఛార్జీ అయితే చేయలేదు.ఎక్కడా ఉద్రిక్త పూర్వక వాతావరణం అయితే విజయవాడ కేంద్రంగా జరగలేదు.ఇన్ని సానుకూలతల మధ్య
ఉద్యోగులను తనదైన పంథాలో నడిపేందుకే సీఎం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అన్న మాట నిజం.చర్చల సమయంలో నెలకొన్న కొన్ని ప్రతిష్టంభనలు తొలగించేందుకు కూడా జగన్ చూస్తున్నారు.
ప్రతిష్టంభన తొలగిపోవడం తథ్యం!
కొన్ని సందర్భాల్లో సంయమనం కోల్పోకుండా సజ్జల లాంటి ప్రభుత్వ పెద్దలు చర్చలు జరుపుతూనే ఉన్నారు. కొన్ని విషయాల్లో పరస్పర అంగీకారం లేకపోయినా అసలు వాళ్లేం అనుకుంటున్నారో తెలుసుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దిద్దుబాటు చర్యలకు కూడా వెళ్తున్నారు.సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ కొన్ని,కొన్ని విభేదాలు ఉన్నా కూడా
అవన్నీ ఆఖరులో పరిష్కృతం కావడం ఖాయం.కొత్త వేతన సవరణ ప్రకారం ఇవ్వాలనుకున్న వాటికి కొంత సవరణలు జోడించాలని అనుకుంటే మాత్రం ఈ సమస్య ఇక ఓ కొలిక్కి వచ్చిందనే భావించాలి.అప్పుడు సమ్మె అనే పదానికే చోటుండదు.తాము ఆరో తేదీ రాత్రి వరకూ కూడా చర్చలు జరిపేందుకే సిద్ధం అని సీఎం స్పష్టమయిన సంకేతాలు ఇచ్చారు.కనుక వివాదానికి తావే లేకుండా అటు ఉద్యోగులు ఇటు మంత్రుల కమిటీ పరస్పర సమన్వయంతో పనిచేస్తే ప్రతిష్టంభన అన్నది తొలగిపోవడం తథ్యం.