స‌మ‌తామూర్తి ద‌గ్గ‌ర‌కు వెళ్లారు జ‌గ‌న్..ముచ్చింత‌ల్ పోయి త‌నకు ఎంతో కావాల్సిన స్వామీజీ చిన‌జియ‌రును క‌లిశారు.ఆయ‌న అనుగ్ర‌హ భాష‌ణ‌నూ,దివ్య వ‌చ‌నాన్నీ మ‌రియు దీవెన‌ల‌నూ అందుకుని వ‌చ్చారు జ‌గ‌న్.ఈ సంద‌ర్భంగా చాలా సేపు ఆయ‌న అక్క‌డే గ‌డిపారు. రెండు తెలుగు రాష్ట్రాల‌కూ చెందిన స్వామిజీ కావ‌డంతో ప్ర‌ముఖులు అంతా ఇప్పుడు ఆయ‌న చుట్టూనే కాదు కాదు ఆశ్ర‌మ‌యం చుట్టూనే ఉంటారు అనుకోండి.అది వేరే విష‌యం.అయినా స‌రే! జ‌గ‌న్ రాక‌తో మొత్తం ప్రాంగ‌ణంలో వాతావ‌ర‌ణ‌మే మారిపోయింది.ఇప్ప‌టికే చెవిరెడ్డి ఆయ‌న సేవ‌లోనే ఉన్నారు.


ఇంకా వైసీపీనేత‌లు చాలా మంది  ఆయ‌న సేవ‌లోనే ఉన్నారు క‌నుక జ‌గ‌న్ కూడా ఓ సారి వెళ్లి వ‌చ్చి ఉండ‌వ‌చ్చు. పోల‌వ‌రం కాంట్రాక్ట‌రు అయిన మేఘా కంపెనీ పెద్ద‌లు, మై హోం సంస్థ‌ల‌కు అధినేత‌లు ఇంకా జ‌గ‌న్ కోరి కోరి కొనిపించిన టీవీ 9 సంస్థ‌ల‌కు ఇప్ప‌టి అధినేత‌లు ఇలా అంతా స్వామి మ‌నుషులు కావ‌డంతో, యువ ముఖ్య‌మంత్రి కూడా స్వామి మ‌నిషే అయిపోయారు. ఏం లేదు వ్యాపారం బాగుంటే మ‌నుషులు ఓ చోట చేరుతారు.


వ్యాపారంతో పాటు ఇంకొన్ని రాజ‌కీయాంశాలు కూడా బాగుంటే ఆశ్రమ నిర్మాణాల‌కు విరాళాలు, భారీ కానుక‌ల చ‌దివింపులు అన్న‌వి జ‌రిగిపోతూనే ఉంటాయి. ఆ విధంగా చెవిరెడ్డి తో స‌హా చాలా మంది మ‌న స్వామీజీకి బాగానే చెల్లింపులు చేశార‌నే అనుకుంటున్నారు. ఆ విధంగానో ఏ విధంగానో కొత్త ఆశ్ర‌మానికి విరాళాల‌కు పెద్ద‌గా లోటేం లేదు. మొత్తం ఆశ్ర‌మం విలువే వెయ్యి కోట్లు. స్థ‌లం వంద ఎక‌రాల‌కు పైగా.. అటు కేసీఆర్ కు ఇటు జ‌గ‌న్ కు ఏక కాలంలో న‌చ్చిన స్వామీజీ ఆయ‌నొక్క‌రే కావ‌డం మ‌రో విశేషం. దీంతో దేశ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందిన 108 ఆల‌యాలు ఇక్క‌డి ప్రాంగ‌ణాలు అత్యంత సులువుగా కొలువు దీరాయి. ఆఖ‌రికి రామోజీకి కూడా చేత‌గాలేదు.. ఆయ‌న ఆధ్యాత్మికత పేరిట నెల‌కొల్పాల‌నుకున్న ఓం సిటీ ఎందాక వ‌చ్చిందో కానీ అంత‌కుమించిన పేరు మ‌రియు వైభ‌వం జియ‌రు స్వామి ద‌క్కించుకున్నారు. క‌నుక స్వామీజీ అంద‌రి వాడు కానీ జ‌గ‌న్ మాత్రం కొంద‌రి వాడు ఇప్ప‌టికీ మ‌రియు ఎప్ప‌టికీ .. ఎనీ డౌట్స్ !
 

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp