తెలంగాణ సీఎం కేసీఆర్ ముంబయిలో పర్యటించారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తోనూ.. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ తోనూ కేసీఆర్ చర్చలు జరిపారు.. కేంద్రం దురాగతాలు ఎదుర్కొనేందుకు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై చర్చించారు.  దేశంలో రావాల్సిన మార్పులపై ఉద్దవ్ ఠాక్రేతో చర్చించినట్టు కేసీఆర్ చెప్పారు.


ఈ భేటీలు ఇంకా కొనసాగుతాయని.. అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని.. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ వెల్లిడిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఇండియాలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయని.. దేశంలో చాలా మార్పులు రావాల్సి ఉందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.


అయితే కేసీఆర్ ముంబయి పర్యటనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో ప్రజల కోపం నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ ముంబయి వెళ్లారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణలో ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని.. వారి దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ కొత్తగా ఇలా ముంబయి టూర్లు వంటి అంశాలతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌కు ఇలా జాతీయ రాజకీయాల పేరిట దృష్టి మళ్లించడం ఇదేమీ కొత్త కాదని ఈటల రాజేందర్ గుర్తు చేశారు.


గతంలోనూ ఇలాగే థర్డ్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ విఫల ప్రయత్నం చేశారని.. ఇప్పుడు మరోసారి అదే పాట పాడుతూ అందరినీ ఆకర్షించే పని ప్రారంభించారని ఈటల అన్నారు. అయితే.. కేసీఆర్ మోసాలను గ్రహించలేని స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని.. కేసీఆర్ వ్యూహాలకు జనం బాగానే బుద్ధి చెపుతారని ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసాల గురించి గ్రహించారని.. అవసరమైన సమయంలో బుద్ది చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్‌ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: