ప్రస్తుతం 5 రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ జోరుగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ మరియు పంజాబ్ రాష్ట్రాలలో ఫలితాలు ఇంకాసేపట్లో తేలనున్నాయి. అయితే పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ మీద అందరి కళ్ళు నిలిచాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఇక అధికారికంగా ప్రకటన రావడం ఒక్కటే తరువాయి, మొత్తం 403 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 202 స్థానాలలో గెలవాల్సి ఉంది. ఇప్పటికే 270 స్థానాలకు పైగా లీడింగ్ లో ఉంది. ఉత్తరప్రదేశ్ లో మళ్లీ మోదీ యోగి ల మ్యాజిక్ వర్క్ ఔట్ అయింది అని రాజకీయ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు.

అయితే ఈ సారి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాధ్ కనుక సీఎం అయితే చరిత్ర సృష్టిస్తారు అని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1985 నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క సీఎం కూడా తర్వాత జరిగే ఎన్నికలో గెలిచిన సందర్భం లేదు. ఇంతకు ముందు యూపీ సీఎం లుగా ఉన్న ములాయం సింగ్ యాదవ్, కళ్యాణ్ సింగ్, మాయావతి, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్ నాథ్ సింగ్, అఖిలేష్ యాదవ్ లు సీఎం లుగా అయిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అయితే ఇప్పుడు సీఎంగా కొనసాగుతున్న ఆదిత్యానాథ్ విషయంలో అది రివర్స్ అవ్వనుంది.

యోగి గోరఖ్ పూర్ పట్టణ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 60 వేలకు పైగా మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నాడు. కొంత సేపటికి యోగి విజయాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు యోగి పేరు చరిత్రలో నిలిచిపోతుంది.  అయితే ఎంత మెజారిటీతో గెలవనున్నాడు అన్నది తెలియాలంటే ఇంకాస్త సేపు ఆగాల్సిందే. మొత్తానికి యోగి ఇంతకు ముందు సీఎంలు ఎవ్వరూ చేయని విధంగా పాలనా చేసి ప్రజల మనసు గెలుచుకున్నాడు. అందుకే అందరూ యోగిని ఆడు మగాడ్రా బుజ్జి అంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: