ఈనాడు పత్రిక రాతలపై కోర్టుని ఆశ్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ప్రకటించారు. ధాన్యం కొనుగోలులో దోపిడీ అంటూ ఈనాడు పత్రికలో వచ్చిన వార్తా కథనంపై ఆయన మండిపడ్డారు. ఈ కథనం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆర్‌బీకే ద్వారా రైతులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని  పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు గుర్తు చేశారు. ఆర్బీకేలపై వచ్చిన ఈనాడు కథనం పూర్తి అవాస్తవమని, ఆర్‌బీకేలపై దుష్ప్రచారం చేస్తున్నారని  పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మండిపడ్డారు.


అసలు పొలమే లేని వ్యక్తి ఆర్‌బీకేకు ధాన్యం అమ్మడానికి వెళ్లగా తిరస్కరించినట్లు ఈనాడు పత్రిక సృష్టించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అంటున్నారు. తనకి పొలమే లేదని, తాను రైతునే కాదని, అదంతా అబద్దమని ఆ వ్యక్తే చెబుతున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు వివరించారు. రైతులే కాని వారిని రైతులగా చూపిస్తూ తప్పుడు వార్తలతో ఈనాడు విషప్రచారం చేస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు  ఆరోపించారు.


రైతులకి మేలు చేయడానికే తమ ప్రభుత్వం‌ ఉందని.. అందుకే ఈనాడు విషప్రచారంపై కోర్టుని ఆశ్రయించనున్నామని... దిగజారుడు వార్తలతో మీ పత్రిక విలువ మరింత దిగజార్చు కుంటున్నారని.. రాజ్యసభ ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌ చెప్పిన మాటలకు.. ఈనాడు వార్తకు సంబంధం లేనేలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అన్నారు. ఈ కేవైసీ త్వరగా చేయకపోవడం వల్ల తప్పులకు అవకాశాలున్నాయని ఎంపీ సుభాష్‌ చంద్రబోస్ చెప్పినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ కూడా  వివరణ ఇచ్చారు.


68 వేల రైతులు తూర్పు గోదావరిలో ఉంటే 51 వేల మంది నమోదు చేస్తుకున్నారని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. ఇంకా 17 వేల మంది రైతులు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉందని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ అన్నారు.  ఈ కేవైసీ నమోదుతో అక్రమాలకి ఆస్కారం ఉండదని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: