అవును చంద్రబాబునాయుడు గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రిజల్టు మాత్రం వన్ సైడే ఖాయమని చెబుతున్నారు. మరలాంటపుడు ఈనెలలో జరగబోయే ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో పాల్గొనవచ్చు కదా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికలు ఈనెల 23వ తేదీన జరుగుతున్న విషయం తెలిసిందే.






జనాల్లో జగన్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదే నిజమైతే, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వార్ వన్ సైడే అన్నది నిజమే అయితే టీడీపీ తరపున ఆత్మకూరులో అభ్యర్ధిని పోటీలోకి దించితే జగన్ పనైపోతుంది కదా. చనిపోయిన అభ్యర్ధి కుటుంబంలో టికెట్ ఇస్తే టీడీపీ పోటీచేయదనే సంప్రదాయాన్ని పార్టీ గతంలోనే తుంగలో తొక్కేసింది. నంద్యాలలో వైసీపీ ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి చనిపోయారు. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ పోటీలోకి దిగింది.






చనిపోయేనాటికి నాగిరెడ్డి టీడీపీలోనే ఉన్నారుకాబట్టి ఆయన టీడీపీ ఎంఎల్ఏనే అనే వితండవాదాన్ని వినిపించారు. అప్పట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలాగైనా గెలిచిపోవచ్చనే ధీమాతో వితండవాదం వినిపించి అభ్యర్ధిని బరిలోకి దింపి గెలిపించుకున్నారు. నిజంగానే జగన్ పై జనాల్లో వ్యతిరేకత ఉన్నదే వాస్తవమైతే సంప్రదాయాన్ని చంద్రబాబు తుంగలో తొక్కేసినా ఎవరూ పట్టించుకోరు.






ఆత్మకూరు పోటీలో టీడీపీ అభ్యర్ధిని దింపి గెలిపించుకుంటే అప్పుడు జగన్ కు దిమ్మతిరగటం ఖాయం. అన్నీసార్లు సెంటిమెంటు పనిచేయదని రుజువుచేసినట్లూ అవుతుంది, అధికారపార్టీని ఓడించినట్లూ అవుతుంది. అప్పుడు జగన్ పై జనాల్లో ఎంతస్ధాయిలో వ్యతిరేకత ఉందో రాష్ట్రమంతా అర్ధమైపోతుంది. ఆత్మకూరు జనాలు జగన్ వైపే లేకపోతే చంద్రబాబు వైపో తేలిపోతే భవిష్యత్ ఎన్నికల్లో జనాల మూడ్ పై కాస్త అంచనాలు అందుతాయి. ఆత్మకూరును ఈజీగా గెలుచుకునే అవకాశాలున్నపుడు చంద్రబాబు ఇంతమండి గోల్డెన్ ఛాన్సు ఎందుకు మిస్ చేసుకుంటున్నట్లు ? అదేదో సినిమాలో చెప్పినట్లు అస్సలు తగ్గేదేలే అని రంగంలోకి దిగిపోతేనే టీడీపీకి మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: