విడిపోవాలని మానసికంగా సిద్ధపడుతున్న మిత్రపక్షాలు ఒకదాన్ని మరొకటి బాగానే అవమానించుకుంటున్నాయి.  తాజాగా జరిగిన డెవలప్మెంట్లు దీన్ని స్పష్టగా నిరూపించేదిగానే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించారు వెళ్ళిపోయారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైసీపీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. తర్వాత తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ ప్రజా ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు.






ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ట్విస్టు ఇక్కడే ఉంది. ఇంతకీ అదేమిటంటే మిత్రపక్షం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు మాత్రం ద్రౌపదిని కలిసే అవకాశం రాలేదు. జనసేన తరపున ద్రౌపదికి వచ్చే ఓట్లేమీలేదు. ఉన్న ఒక్క ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ కూడా ఎప్పుడో జెండా ఎత్తేసి వైసీపీతోనే  తిరుగుతున్నారు. ఓట్లులేకపోయినా పర్వాలేదు మిత్రపక్షం అధినేత హోదాలో రాష్ట్రపతి అభ్యర్ధితో పవన్ను కలపటం పెద్ద కష్టమేమీకాదు.






ఆమె బసచేసిన హోటల్లోనో లేకపోతే గన్నవరం విమానాశ్రయం లాబీలోనే ఓ ఐదు నిముషాలు పవన్ తో భేటీ అయ్యుండచ్చు. కానీ ముర్ముతో పవన్ను కలపాలని బీజేపీనే అనుకోలేదు కాబట్టి వీళ్ళ భేటీ జరగలేదు. మొన్నటికిమొన్న నరేంద్రమోడీ భీమవరం పర్యటనలో కూడా ఇలాగే జరిగింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మోడీ భీమవరం వచ్చారు. ఆ కార్యక్రమానికి చివరి నిముషంలో ఆహ్వానాన్ని పంపారు. పైగా జనసేన తరపున ఒక ప్రతినిధిని పంపమని అడగారు.






అంటే మోడీ కార్యక్రమంలో పవన్ పాల్గొనటం బీజేపీకి ఇష్టంలేదన్న విషయం అర్ధమైపోతోంది. పవన్ అన్న చిరంజీవికేమో కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పదిరోజుల ముందుగానే ఆహ్వానాన్ని పంపించారు. అదే మిత్రపక్షమని కూడా చూడకుండా చివరినిముషంలో ఇన్విటేషన్ ఇచ్చి ప్రతినిధిని పంపమన్నారు. అదే పెద్దఅవమానంగా భావించిన పవన్ మొక్కుబడిగా ఎవరికో పురమాయించారు.  ఇపుడు ద్రౌపది విషయంలో కూడా సేమ్ టు సేమ్ మళ్ళీ అలాగే బీజేపీ వ్యవహరించింది. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే పవన్ను అవమానిస్తున్నట్లు అర్ధమైపోతోంది. మరి పవన్ రియాక్షన్ ఎలాగుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: